Thursday, 5 November 2026

18 నుంచి సమ్మెబాట

ఆదిలాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి న్యాయవాదులు సమ్మెను ఉధృతంచేయబోతున్నారు. వీరికి న్యాయశాఖ ఉద్యోగులు కూడా మద్దతు పలికారు. హైకోర్టు సానుకూలంగా స్పందించకుంటే ఈనెల 18 నుంచి సమ్మెకు సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. నెలరోజులుగా హైకోర్టును విభజించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలుపుతున్న న్యాయవాదుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. గతంలో ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నివేదిక ఇచ్చిన షెట్టి కమిషన్‌ ప్రతిపాదనలు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌చేశారు. నిజాం కాలంలో నియమించిన ఉద్యోగాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, దీంతో ఉద్యోగులపై పనిభారం పెరిగి ఒత్తిడి తీవ్రం అవుతోందన్నారు. దీంతో న్యాయశాఖ ఉద్యోగులు త్వరలో సమ్మెబాటకు సిద్ధమవుతున్నారు. ఈనెల 2న వారంతా సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రత్యేకహైకోర్టు ఏర్పాటుతోపాటు తమ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా 18నుంచి వారు విధులు బహిష్కరించనున్నారు. సమ్మె సన్నద్ధతపై న్యాయశాఖ ఉద్యోగుల జిల్లా కార్యవర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఈనెల 17వ తేదీవరకు సమస్య పరిష్కరించాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు, ఆతర్వాత స్పందన కనిపించకపోతే విధుల బహిష్కరణ అనివార్యమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *