హైదరాబాద్: అల్లరి నరేష్, షర్మిల మాండ్రే జంటగా దేవీప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కెవ్వు కేక’ జాహ్నవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బొప్పన చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర బృందం ‘కెవ్వు కేక’ విశేషాలను వెల్లడించింది. ప్రేక్షకుల చేత కెవ్వుకేక అనిపించేలా వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామన్నారు. చిన్నిచరణ్ అందించిన సంగీతానికి శ్రోతల నుంచి విశేష స్పందన లభిస్తోందని చిత్ర బృందం అనందం వ్యక్తం చేసింది. కెవ్వుకేక పాటలను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.




