Tuesday, 3 November 2026

19న ఢిల్లీ వెళ్లి ఆంటోని కమిటీని కలుస్తాం : ఉత్తంకుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సేలు అందరం  ఆంటోని కమిటీని కలుస్తామని మంత్రి ఉత్తంకుమార్‌ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 19న తెలంగాణ నేతలం ఢిల్లీ వెళ్లి రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన ఆంటోని కమిటీని కలుస్తామని పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ సీడబ్ల్యూసీ చేసిన తీర్మానాన్ని త్వరగా అమలు చేయాలని ఆంటోని కమిటీని కోరుతామని మరో మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో కమిటీకి వివరిస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *