2ఏళ్లుగా రేప్: తండ్రి, సోదరుడు, అంకుల్‌పై యువతి ఫిర్యాదు

జల్పాయిగురి: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన కూతురును కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి, తన చెల్లెలిని ఎంతో భద్రంగా చూసుకోవాల్సిన సోదరుడు, బాధ్యతగా వ్యవహరించాల్సి అంకుల్‌.. కామంతో కళ్లు మూసుకుపోయి సమాజం సిగ్గుపడే విధంగా ప్రవర్తించారు. ఓ యువతి దుస్థితిని చూస్తే ఆమె వేదన అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే.. తనపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నారని ఓ యువతి(16) తన తండ్రి, సోదరుడు, అంకుల్‌పై ఫిర్యాదు చేసింది. అంతేగాక, తాను రెండు సార్లు గర్భవతినయ్యానని, నాలుగు సార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది. 2ఏళ్లుగా రేప్: తండ్రి, సోదరుడు, అంకుల్‌పై యువతి ఫిర్యాదు విచాకర విషయమేంటంటే.. బాధిత యువతికి ఆమె తల్లి ఎలాంటి సహాయం అందించలేదు. అంతేగాక, ‘వారంతా కొత్తవారు కాదు, నీ తండ్రి, సోదరుడు, అంకులే కాదా’ అని యువతికి ఆ తల్లి తెలిపిందట. కుటుంబసభ్యుల వేధింపులకు తాళలేక బాధిత యువతి గురువారం తన పాఠశాల టీచర్‌కు విషయం చెప్పింది. కాగా, గురువారం కూడా ఆ యువతిపై 20ఏళ్ల ఆమె సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె టీచర్, పాఠశాల ప్రిన్సిపాల్ బాధిత యువతితో కలిసి ధూప్‌గురి పోలీస్ ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వెంటనే ఆమె అంకుల్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం బాధితురాలి తండ్రి, సోదరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధితురాలి తల్లి పరారీలో ఉంది. బాధితురాలిని జల్పాయిగురి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తరలించారు.