అక్టోబర్ 2న మెట్రోరైలు నమూనా : ఎన్‌వీఎస్
హైదరాబాద్ : అక్టోబర్ 2న మెట్రోరైలు నమూనా ప్రదర్శన ఏర్పాటు చేస్తామని మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎస్‌వీఎస్‌రెడ్డి తెలిపారు. 2015 ఉగాది నాటికి మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా మెట్రో పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రకటించారు. మెట్రో రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్న విషయం విదితమే.



