Thursday, 5 November 2026

2.5 లక్షల ఎల్ ఓ సి చెక్కు ను అందజేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

 

గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (19): మండల పరిధిలోని పోలికే పహాడ్ గ్రామానికి చెందిన కావలి నీలమ్మ W/o తిరుపతయ్య అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళగా మంత్రి వెంటనే స్పందించి 2.5 లక్షల ఎల్ ఓ సి చెక్కును మంజూరు చేయించి గురువారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో చెక్కును భర్త కావలి తిరుపతయ్యకు అందజేశారు.తన భార్య ఆపదలో ఆదుకున్న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కావలి తిరుపతయ్య ధన్యవాధాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి రజనీ రాజు, తెరాస సోషల్ మీడియా మండల కన్వీనర్ శివకుమార్ , వార్డు సభ్యుడు పులేందర్, యాదగిరి ,తదితరులు పాల్గొన్నారు.