Thursday, 5 November 2026

బీసీలకు సామాజిక న్యాయం జరగాలి

– ధనుంజయ నాయుడు
హుజూర్ నగర్ జనవరి 19 (జనంసాక్షి): స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ నేటికీ బీసీలకు సామాజిక న్యాయం జరగట్లేదని బీసీ హక్కులసాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన హుజూర్ నగర్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ
దేశ జనాభాలో 56శాతంగా ఉన్న బీసీలకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వo ఎలాంటి న్యాయం చేయలేదని, బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూస్తున్నారని, బీసీల మధ్య ఐక్యత కొరవడటం వల్లనే ఈ పరిస్థితి దాపురించినదని, ఇంకెంతకాలం బీసీలు మౌనం వహిస్తారని, ప్రజలు గోవులనుకుంటే గతులు మారిపోతాయి గోవుల కొమ్ముల్లోనే కొడవళ్ళు మొలుస్తాయని, బీసీలను ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని ఆయన హెచ్చరించారు. త్వరలో చేపట్టబోయే జన గణనలో కులగణను బిజెపి ఎందుకు వ్యతిరేకిస్తుందో ప్రజలకు తెలియజేయాలని, బిజెపి పక్కాగా బీసీల వ్యతిరేక పార్టీ అని స్పష్టమవుతుందని,, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మౌనం వీడాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రుణాల కోసం, అనేక మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారని వారందరికీ బ్యాంకులతో సంబంధం లేకుండా రుణ సౌకర్యం కల్పించాలని, ధనుంజయ నాయు డు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా నాయకుడు రావుల సత్యం, రాపోలు వెంకన్న, నన్నెపంగ నాగరాజు పాల్గొన్నారు.