Monday, 2 November 2026

ఒడిషాలో 20మంది బాలనేరస్థుల పరారు

బెర్హంపూర్: ఒడిషాలోని ప్రభుత్వ బాల నేరస్థుల వసతి గృహం నుంచి 20 బాల నేరస్థులు తప్పించుకొనిపోయారు. బాల నేరస్థులు గత రాత్రి కూరగాయలు కోసే కత్తులతో సిబ్బందిపై దాడికి పాల్పడి పరారయ్యారు. ఈ ఘటనలో సూపరింటెండెంట్ సంజయ్‌కుమార్ మహంతితోపాటు మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయలైన వారిని ఆస్పత్రికి తరలించామని.. వీరిలో మహంతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సహోద్యోగుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *