Tuesday, 3 November 2026

July 2012

వార్తలు

అటవీశాఖ పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో అపశృతి

నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరులో మంగళవారం నిర్వహించిన అటవీశాఖ పర్యావరణ పరిరక్షణ ర్యాలీలో  అపశృతి చోటుచేసుకుంది. అటవీశాఖ నిర్వహిస్తున్న మూడు కిలోమీటర్ల ర్యాలీలో ఐదుగురు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిని చికిత్స నిమిత్తం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు.

వార్తలు

మీడియాకు అన్నాహజారే క్షమాపణ

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద మీడియాపై తమ బృందం సభ్యులు దౌర్జన్యానికి పాల్పడటంపై అన్నా హజారే విచారం వ్యక్తం చేశారు. ఇందుకుగాను మీడియాకు ఆయన క్షమాపణలు తెలియజేశారు. దీక్షావేదికమీదనుంచి ఆయన ఈ విషయం ప్రకటించారు. దీక్షాసమయంలో ఎలాంటి హింసాత్మక చర్యలకు…

వార్తలు

నెల్లూరు రైల్వే స్టేషన్‌ వద్ద బంధువుల ఆందోళన

నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటన జరిగి 30 గంటలు గడుస్తున్నా ఇంకా కొందరి ఆచూకీ లబించలేదంటూ నెల్లూరు రైల్వే స్టేషన్‌ వద్ద బంధువులు అధికారులను నిలధీశారు. ఎస్‌-11 బోగీలో ప్రయాణిస్తున్న తమ బంధువుల ఆచూకీ ఇంత వరకు…

వార్తలు

కరవుబృందం పర్యటన తేదీల ఖరారుపై చర్చిస్తారు.

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ వారంలో మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీలో హోంమంత్రి స్థానాన్ని విద్యుత్‌శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి కావటంతో…

వార్తలు

కరవుపై నేడు మంత్రుల కమిటీ సమీక్ష

న్యూఢిల్లీ: దేశంలో అనేక రాష్ట్రాల్లో వర్షపాతం ఆశించినస్థాయిలో లేకపోవటం, అనేక ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొనటంతో దీనిపై ఈరోజు కేంద్రం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. వ్యవసాయమంత్రి శరద్‌పవార్‌ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేకంగా  ఏర్పాటుచేసిన  మంత్రుల కమిటీ కరువుపై సమీక్షా…

వార్తలు

అన్నా బృందం క్షమాపణకు మీడియా డిమాండ్‌

న్యూఢిల్లీ: అవినీతిపై పోరు, బలమైన లోక్‌పాల్‌ కోసం పోరాటంలో భాగంగా అన్నా హజారే ఆయన బృందం చేపట్టిన దీక్ష నేటికి మూడవరోజుకు చేరింది. గత రాత్రి జంతర్‌మంతర్‌ వద్ద మీడియా పై అన్నాబృందం దాడిని, వారి వ్యాఖ్యలను బ్రాడ్‌కాస్ట్‌…

వార్తలు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఏడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.…

వార్తలు

ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూల్‌ బస్సు

కడప: కడప జిల్లా సాంబేపల్లి మండల పరిధిలోని నారాయణపల్లి గ్రామం ఎర్రగుంట్ల బస్టాండు వద్ద ఆగిఉన్న ఆర్టీసీ బస్సును విజ్ఞాన్‌ స్కూల్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వీరిని వెంటనే ఓ…

వార్తలు

దగ్థమైన బోగీని పరిశీలించిన ఫోరెన్సిక్‌ బృందం

నెల్లూరు: చింనెల్లూరులోని అగ్నిప్రమాదానికి గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌- 11 బోగీని ఫోరెన్సిక్‌ బృందం మంగళవారం  ఉదయం పరిశీలింది. దగ్థమైన బోగీలో నుంచి ఫోరెన్సిక్‌ అధికారులు నమూనాలే సేకరించారు. నమూనాలతో కూడిన నివేదికను రైల్వేశాఖకు అందిస్తారు.

వార్తలు

అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

కృష్ణా: కృష్ణా జిల్లా చందర్లపాడులో అంబేద్కర్‌ విగ్రహాన్ని సోమవారం అర్థరాత్రి గుర్తి తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా దళితులు, దళిత సంఘం  నాయకులు చందర్లపాడులో ధర్నా చేస్తున్నారు. దుకాణాలు, పాఠశాలలు మూయించి బంద్‌ ప్రకటించారు. స్థానిక…