Saturday, 7 November 2026

July 2012

హైదరాబాద్

ఓయూ,కేయూ పరిధీలోని 55సీట్లు పెంచాలి: హైకోర్టు

హైదరాబాద్‌: ఓయూ, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో 55 సీట్లు చొప్పున పెంచాలని హైకోర్టు వ్యాఖ్యనించింది.  మెడికల్‌ సీట్ల పెంపుపై రెండ్రోజుల్లో నిరణయం ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది.  నెలలోగా ఓయూ, కేయూ పరిధిలోని కళాశాలల లోటుపాట్లు సరిదిద్దాలని న్యాయస్థానం సూచించింది.

వార్తలు

గ్రేహౌండ్స్‌ ఐజీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ షాక్‌

హైదరాబాద్‌ : నేషనల్‌ హ్యూమన్‌రూట్స్‌ కమిషన్‌ గ్రేహౌండ్స్‌ ఐజీ సీతారామాంజనేయులుకు షాక్‌ ఇచ్చింది. గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు చేసిన ఎన్‌కౌంటర్లని బూటకమేనని హెచ్‌ఆర్‌సీ వాఖ్యనించింది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహరం ఇవ్వాలని హెచ్‌ఆర్‌సీ…

హైదరాబాద్

డెయిరీ ప్రదర్శన ప్రారంభించిన కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నగరంలోని హైటెక్స్‌లో డెయిరీ షో ప్రారంభించారు. పాడి పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలను ఈ ప్రదర్శనలో ఉంచారు.

వార్తలు

ప్రణబ్‌ముఖర్జీతో సబ్బం హరి సమావేశం

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీతో ఎంపీ సబ్బం హరి భేటీ అయ్యారు. సబ్బంతోపాటు కేంద్ర మంత్రి నారాయణ స్వామి కూడా ప్రణబ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వీరు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి…

హైదరాబాద్

తెలంగాణ మెడికల్‌ సీట్ట కోసం మెడికల్‌ జేఏసీ ఆందోళన

హైదారాబాద్‌: తెలంగాణ మెడికల్‌ సీట్ల కోసం తెలంగాణ మెడికల్‌ జేఏసీ ఆందోళన బాట పట్టింది. మెడికల్‌ సీట్లు పెంచాలంటూ శుక్రవారం గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఒక రోజు దీక్ష చేపట్టింది. ఈ దీక్షను తెలంగాణ రాజకీయ జేఏసీ కోదండరాం…

వార్తలు

గుంటూరులో మాజీ జడ్పీటీసీ హత్య

గుంటూరు:ఏడు రోజుల క్రితం అదృశ్యమైన జిల్లా పరిషత్‌ మాజీ సభ్యుడు కొలగాని ప్రసాద్‌ దారుణ హత్యకు గురయ్యాడు.అతని మృతదేహన్ని రేపల్లే మండలం మారుతోట వద్ద పోలీసులు ఈ ఉదయం గుర్తించారు.డబ్బు నగల కోసం మరో వ్యక్తితో కలిసి ఆయన…

వార్తలు

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల జాబితా 15న వెల్లడి

హైదరాబాద్‌:ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ప్రవేశాల జాబితాను ఈ నెల 15న విడుదలచేమనున్నారు.తొలుత నిర్ణయించిన ప్రకారం శుక్రవారం జాబితాను వెల్లడించాలి.ఈ మేరకు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం గురువారం ఓ ప్రకటన లో విడుదలచేసింది.

హైదరాబాద్

సీఎం కిరణ్‌ వల్లనే తెలంగాణ జప్యం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా మారాడని కాంగ్రెస్‌ నేత నిజామాబాద్‌ ఎంపీ మధుయాష్కి అన్నారు. సీఎం వల్లే తెలంగాణ ఆలస్యం అవుతోందని ఆయన విమర్శించారు. సీఎం రేపటి నుంచి చేపట్టబోయే ‘ఇందిరమ్మ బాట’ను తెలంగాణ ప్రజలు…

కరీంనగర్

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ధర్మపురి,కరీంనగర్‌:గోదావరి నది తీరం నుంచి రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ధర్మపురి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నందకు యజమానులపై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లును పొలీసుస్టేషన్‌కు తరలించినట్లు ధర్మపురి డిప్యూటీ తహపీల్దార్‌ ప్రభాకర్‌రావు తెలిపారు.

వార్తలు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి:తిరుమలలో భుక్తల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం ఉదయం భక్తులు 24 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4గంటల సమయం పడుతోంది.