Friday, 6 November 2026

July 2012

వార్తలు

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

తిరుపతి:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం ఉదయం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు,శ్రీవారి సర్వదర్శనానికి 20గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5గంటల సమయం పడుతోంది.ఆలయంలో కొయిల్‌ ఆళ్యార్‌ తిరుమంజనం నిర్వహిస్తుండడంతో ఉదయం 11గంటల వరకు దర్శనం నిలిపి వేశారు.

వార్తలు

కోరిక తీర్చలేదని వివాహిత పై కాల్పులు

చిత్తూరు : చిత్తూరులో దారుణం జరిగింది.  తమ కోరిక తీర్చలేదని వివాహిత పై కాల్పులు ముగ్గురు యువకులు నాటు తూపాకితో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అమె త్రీవంగా గాయపడింది. ఈ ఘటన పీలేరు మండలం…

వార్తలు

రేపు,ఎల్లుండి దేశవ్యాప్తంగా న్యాయవాదుల సమ్మె

న్యూఢిల్లీ:న్యాయ విద్యా వ్యవస్థను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఉన్నత విద్య పరిశోధన బిల్లును నిరసిస్తూ న్యాయవాదులు రెండురోజుల సమ్మెకు దిగుతున్నారు.ప్రభుత్వ చర్యలకు నిరసనగా బుధ,గురు వారాల్లో దేశవ్యాప్తంగా న్యాయవాదులు సమ్మె చేపడతారని, ఆ రెండు రోజులు లాయర్లు విదులకు…

ఖమ్మం

ఈ రోజు కలెక్టరేట్‌ ముందు టీఆర్‌ఎస్‌ ధర్నా

ఖమ్మం : కృష్ణాడెల్టాకు నీరు విడుదలను నిరసిస్తూ ఖమ్మం కలెక్టరేట్‌ ముందు ఈ రోజు టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా చేపట్టనుంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు పాదయాత్ర చేపాట్టారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే రాజయ్య పాల్గొని సంఘీభావం తెలియజేశారు.

వార్తలు

కోస్తా,తెలంగాణలకు వర్ష సూచన

విశాఖపట్నం:రాష్ట్రంలోని కోస్తా,తెలంగాణాల్లో మంగళవారం రాత్రి వరకు పలుచోట్ల తేలికపాటి మోస్తరు వర్షాలు,ఉరుములతో కూడిన జల్లులు,ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు.రాయలసీమలో ఒకట్రెండు చోట్ల మాత్రమే ఉరుములతో కూడిన…

హైదరాబాద్

ఈ సేవ కేంద్రల్లో టెట్‌ ఓఎంఆర్‌ కాపీలు

హైదరాబాద్‌ : టెట్‌ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్‌ కాపీలను అన్ని ఈ సేవ కేంద్రల్లో అందుబాటులో ఉంచినట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. వీటిని అభ్యర్థులు రూ. 20 రుసుము చెల్లించి మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి…

వార్తలు

యువతిని వేధించిన హెడ్‌కానిస్టేబుల్‌

హైదరాబాద్‌:అకతాయిలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిన యువతినే వేదింపులకు గురి చేసి ఆసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌రెడ్డిని కూకట్‌ పల్లి పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అశోక్‌రెడ్డి కూకట్‌పల్లి పొలీస్‌స్టేషన్‌లో హెడ్‌కాని స్టేబుల్‌ వివేకానందనగర్‌కు చెందిన ఓ…

హైదరాబాద్

ఈరోజు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో మంగళవారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 29,940. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,300గా ఉండగా కిలో వెండి 52,800గా…

హైదరాబాద్

తెలుగు భాషను కాపాడుకోవాలి:మండలి ఛైర్మన్‌

హైదరాబాద్‌:మరుగున పడుతున్న తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి అన్నారు.అంతర్జాతీయ తెలుగు కేంద్రం ముద్రించిన తెలుగుభారతి 1నుంచి 5వ తరగతి తెలుగువాచకాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన ఆవిష్కరించారు.ఇతర…

వార్తలు

తెదేపా సమావేశం అడ్డుకునేందుకు వైకాపా నేతల యత్నం

విజయవాడ: గుడివాడలో తెదేపా సమావేశాన్ని అడ్డుకునేందుకు వైకాపా నేతలు యత్నించారు. ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్యంలో గుడివాడలో తెదేపా కార్య కర్తలు ఈ ఉదయం సమావేశమయ్యారు. అయితే ఈ కార్యక్రమాన్ని వైకాపా నేతలు అడ్డుకునేందుకు  యత్నించారు. తెదేపా కార్యకర్తలు…