Wednesday, 4 November 2026

July 2012

వార్తలు

నాగోలు ఆర్టీఏ ఆఫీస్‌లో ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌:నాగోలు ఆర్టీఏ కార్యాలయంలో రవాణాశాఖ కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ప్రైవేటు వాహనాలపై దాడులు కొసాగుతాయని ఆయన తెలిపారు.ఇప్పటికే దాడులు నిర్వహించి ప్రైవేటు వాహనాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ఖమ్మం

పాల్వంచ కేటీపీఎస్‌లో కాంట్రాక్టర్ల ధర్నా

ఖమ్మం: పాల్వంచలోని  కేటీపీఎస్‌ ఆరోదశ సీఈ కార్యలయం ఎదుట కాంట్రాక్టర్లు ధర్నాకు దిగారు. బీజేఆర్‌ కంపనీ నుంచి రావాల్సిన రూ. 4 కోట్ల బకాయిలు ఇప్పించాలని వారు డిమాండ్‌ చేశారు.

వార్తలు

ఒడిశా కూలీలపై కానిస్టేబుల్‌ అత్యాచారయత్నం

చిత్తూరు:జిల్లాలోని కలికిరిలో ఒడిశాకు చెందిన మహిళా కూలీలపై కానిస్టేబుల్‌,హోంగార్డు కలిసి అత్యాచారానికి యత్నించారు.అత్యాచారానికి యత్నించిన వీరిని గ్రామస్తులు అడ్డుకోవడంతో పరారీ అయ్యారు.బాదితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

హైదరాబాద్

కోనేరు ఆస్తుల అటాచ్‌మెంట్‌ కోసం పిటిషన్‌

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసుకు సంబందించి సిటి సివిల్‌ కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. కోనేరు ప్రసాద్‌, సునీల్‌ రెడ్డిల అస్తుల అటాచ్‌మెంట్‌ కోసం సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. కోనేరు ప్రసాద్‌కు అతని కుటుంబ సభ్యులకు భీమిలిపట్నం,…

రంగారెడ్డి

సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటం

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గురువారం సీపీఐ భూపోరాటం చేపట్టింది. గ్రామంలోని 31 ఎకరాల అసైస్డ్‌ భూముల్లో సీపీఐ కార్యకర్తలు జెండాలు పాతారు.

వార్తలు

ఉత్తరప్రదేశ్‌ని తాకిన రుతుపవనాలు

లక్నో: రోజుకు గడుస్తున్నా  రుతుపవనాల జాడలేక ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉత్తరాదికి కాస్త స్వాంతన లభించింది. ఈరోజు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను  రుతుపవనాలు తాకాయి. లక్నోలోను, ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. మరో మూడు రోజులపాటు రాష్ట్రమంతటా…

వార్తలు

మద్యం టెండర్ల పై హైకోర్టులో వాదనలు

హైదరాబాద్‌:మద్యం దుకాణాలు టెండర్ల విదానంలో లాటరీ పద్దతిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి.లాటరీ పద్దతి వల్ల ప్రభుత్వం ఆదయం కోల్పోతుందని పిటిషనర్‌ తరపు న్యాయవారి వాదించారు.జూదంలాంటి లాటరీ విదానాన్ని ప్రభుత్వం ఎంచుకోవడం సరికాదని న్యాయవాది…

వార్తలు

మరోసారి ఆస్తుల అటాచ్‌మెంట్‌ పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌:జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబందించి మరోసారి ఆస్తుల అలాచ్‌మెంట్‌ పిటిషన్‌ను సీబీఐ సిటీ సివిల్‌ కోర్టులో దాఖలు చేసింది.రాష్ట్రంలో వివిధ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి తెప్పించిన ఆస్తుల వివరాలతో గురువారం సీబీఐ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది.కోనేరు ప్రసాద్‌,సునీల్‌రెడ్డి…

హైదరాబాద్

తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ప్రారంభిస్తాం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తుందనే నమ్మకం తమకు లేదని ప్రొ.కోదండదాం అన్నారు. తెలంగాణ సాధనకు మరోసారి ఉద్యమాన్ని మొదలు పెడుతామని ఆతర్వాత సంగతి ప్రజలే చూసుకుంటారని ఆయన అన్నారు.

హైదరాబాద్

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారు బోల్తా, ఒకరి మృతి

హైదరాబాద్‌ : ప్రమాదాలకు నిలయంగా మారిన ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఈరోజు మరో రోడ్డుప్రమాదం జరిగింది. హయత్‌నగర్‌ మండలం మన్నెగూడ గ్రామ సమీపంలో ఔటరింగ్‌పై ఓకారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ట్రైనీ మేనేజర్‌గా పనిచేస్తున్న…