Wednesday, 4 November 2026

July 2012

హైదరాబాద్

ముగిసిన ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాలు

హైదరాబాద్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ  ప్రమాద రహిత వారోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. ఈనెల 23 నుంచి 29 వరకూ చేపట్టిన వారోత్సవాల్లో వివిధ రాకల సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. ముగింపు రోజు మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌…

హైదరాబాద్

కూచిపూడి మహాగురువు వెంపటి చినసత్యం మృతికి ముఖ్యమంత్రి సంతాపం

హైదరాబాద్‌: చెన్యయ్‌లో ఈ రోజు కన్ను మూసిన వెంపటి చినసత్యం కుటుంబానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. భారతదేశం గర్వించదగ్గ నాట్యాచారులు ఎందరో కళాకారులను తీర్చిదిద్ది కూచిపూడి నృత్యానికి ఖండాంతర ఖ్యాతిని అర్జించి పెట్టారని ముఖ్యమంత్రి కొనియాడారు.

వార్తలు

టేబుల్‌ టెన్నిన్‌లో సౌమ్యజిత్‌ పరాజయం

లండన్‌: లండన్‌ ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ విభాగం రెండో రౌండ్‌లో భారత క్రీడాకారుడు సౌమ్యజిత్‌ ఓటమి పాలయ్యాడు. కొరియా క్రీడాకారులు కిమ్‌ హోక్‌ చేతిలో 1-4 తేడాతో ఓటమి చవిచూశాడు.

వార్తలు

ఎస్పీవోలపై మావోయిస్టుల కాల్పులు

ఒడిశా: మల్కాన్‌గిరి జిల్లా పొడియాలో ఎస్పీవోలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోల దాడిలో ఇద్దరు ఎస్పీవోలు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్

హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌ పోటీలకు ఆటంకం

హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న జాతీయ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో చివరిరోజు పోటీలకు భారీ ఈదురుగాలులు ఆటంకం కలిగించాయి. 20నాటికల్‌ మైళ్ల వేగంతో వీసిన గాలులకు దాదాపు 20పడవలు బోల్తాపడ్డాయి. వీటిని యుధాస్థితికి తెచ్చేందుకు సెయిలర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది. హైదరాబాద్‌…

కరీంనగర్

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి

కరీంనగర్‌: జిల్లాలో ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సమావేశంలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి శ్రీధర్‌బాబు కూర్చున్న కుర్చీ విరిగిపోయింది. దీంతో శ్రీధర్‌బాబు కిందపడిపోయారు. మంత్రికి గాయాలు కాలేదని సమాచారం.

వార్తలు

హౌసింగ్‌ శాఖపై సమీక్ష: సీఎం

శ్రీకాకుళం: హౌసింగ్‌ శాఖపై పూర్తిగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందిరమ్మ బాటలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు రావాల్సిన రుణాలపై కూడా జిల్లాలో పలు సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.…

వార్తలు

మర్లగూడెం అటవీ ప్రాంతంలో 144 సెక్షన్‌

పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం అటవీ ప్రాంతంలో ఆదివారం గిరిజనులు, అటవీ శాఖ సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అటవీ భూములు గిరిజనులు ఆక్రమించుకుంటున్నారని అటవీ సిబ్బంది మర్లగూడెంలో 144 సెక్షన్‌ విధించారు. ఈ నేపథ్యంలో గిరిజనుల,…

హైదరాబాద్

ముగిసిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు

హైదరాబాద్‌: ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆదివారం జరిగిన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో  పలువురు  సినీప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, రవికిశోర్‌ ప్యానళ్ల మధ్య జరిగిన  ఈ ఎన్నికల సమయంలో రెండు వర్గాల…