Tuesday, 3 November 2026

August 2012

వార్తలు

కాశ్మీర్‌ భారత్‌దే

లాహోర్‌: పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ భారత భూభాగమేనని ఆ దేశానికి చెందిన ఓ అట్లాసులో ప్రచురించిన మ్యాపులో పేర్కోన్నారు. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతం కూడా భారత్‌కు చెందినదే అందులో స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం ప్రచురించిన ఈ అట్లాసుపై…

వార్తలు

వరదనీటితో పరవళ్లు తొక్కుతున్న పాకాల

ఖానపురం: కాకతీయులు నిర్మించిన చారిత్రక పాకాల జలాశయం వరదనీటితో పరవళ్లు తొక్కుతోంది. జలాశయం పూర్తిగా నిండి గురువారం ఉదయం 11 గంటననుంచి మత్తడిపోస్తోంది. వరంగల్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయం గరిష్ట నీటిమట్టం…

వార్తలు

ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌ సస్పెండ్‌ తిరస్కరణ

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌ను సస్సెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం తిరస్కరించింది. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది. రాజ్యసభ సభ్యుడి ఫోర్జరీ చేసి డీజీపీ…

వార్తలు

దసరా పండుగ సందర్భంగా 10 ప్రత్యేకరైళ్లు

సికింద్రాబాద్‌: దసరా పండుగ సందర్భంగా 10 ప్రత్యేకరైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆక్టోబర్‌ 19నుంచి హైదరాబాద్‌ నుంచి ఈ ప్రత్యేకరైళ్లను నడపనున్నట్టు రైల్వేవర్గాలు తెలిపాయి.

వార్తలు

కాల్‌డేటా వ్యవహారంలో ముగురికి బెయిల్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌ డేటా వ్యవహారంలో న్యాయస్థానం ముగ్గురికి బెయిల్‌ మంజూరుచేసింది. ఎంవీ రమణరావు, హనుమంతరావు, శ్రీనివాసరావులకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.

వార్తలు

హత్యకు కుట్ర పన్నారని 11మంది అరెస్టు

బెంగళూరు: ప్రముఖ కన్నడ దినపత్రిక విలేకరిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న అనుమానంతో 11మందిని బెంగళూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక ఆంగ్ల దినపత్రిక విలేకరి ఉండటం గమనార్హం. అరెస్టయిన వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు నగర…

వార్తలు

సిరియాలో కొనసాగుతున్న ఘర్షణలపై ప్రధాని ఆందోళన వ్యక్తం

టెహ్రన్‌: సిరియాలో విదేశీశక్తుల జోక్యన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ స్పష్టంచేశారు. సిరియాలో కొనసాగుతున్న ఘర్షణపై ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మన్మోహన్‌ పిలుపునిచ్చారు.

వార్తలు

లాభాలనార్జించిన సెన్సెక్స్‌

ముంబయి: సెన్సెక్స్‌ గురువారం 51 పాయింట్ల ఆధిక్యంతో ముగిసింది. ఫార్మా, ఐటీ, బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ లాభాలనార్జించినట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. సెన్సెక్స్‌ 50.83 పాయింట్ల లాభంతో 17,541.54 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 27.25…

వార్తలు

అవినీలికి పాల్పడిన ఉద్యోగులపై కేసులు

శంషాబాద్‌: శంషాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో సీనియర్‌ ఆసిస్టెంట్‌ సూరయ్య లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయాడు. సబ్‌రిజిస్ట్రర్‌ నరేందర్‌రెడ్డి ఏసీబీ అధికారులను చూపి పారిపోయాడు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై కేసులు నమోదుచేసినట్టు…

వార్తలు

ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలో ర్యాంకు వస్తే పూర్తి ఫీజు చెల్లిస్తాం

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలో పదివేల లోపు ర్యాంకు వచ్చినవారు ఎవరైనా ఫీజును పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమర్‌రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 687 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింది సీటు…