Friday, 6 November 2026

August 2012

హైదరాబాద్

కల్తీకల్లు ఘటనపై చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశం

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో జరిగిన కల్తీకల్లు ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. సంఘటన జరిగిన కాళ్లకల్‌కు వైద్య బృందాలను పంపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

జాతీయం

రాష్ట్రపతి అవార్డులకు ఎంపికైన ముగ్గురు రాష్ట్ర పోలీసులు

న్యూడిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా కేంద్ర ప్రభుత్వం పోలీసు విశిష్ట సేవా అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో రాష్ట్రం నుంచి ముగ్గురు పోలీసులు ఎంపికయ్యారు. ఎస్‌.ఏ.హుడా(అడిషనల్‌ ఐజీ), సత్యనారాయణ(అవినీతి నిరోదక డైరెక్టర్‌), ఎన్‌.ఏ.సురేంద్రబాబు(ఆక్టోపస్‌ ఐజీ)లు ఉన్నారు.…

జిల్లా వార్తలు

కల్తీ కల్లు కేసులో ఆరుగురి అరెస్ట్‌

మెదక్‌: నిన్న తుప్రాన్‌ మండలం కళ్లకల్‌ కల్తీ కల్లుకు 100 మందికిపైగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. కల్లులో అల్ఫ్రజోలమ్‌ అనే మత్తుమందు కలిపినట్లు అబ్కారీ…

కరీంనగర్

నాటుసారా కేంద్రాలపై అబ్కారీ అధికారుల దాడి

ధర్మపురి: మండలంలోని బుగ్గారం గ్రామంలో ఈ రోజు మధ్యాహ్నం నాటుసారా కేంద్రాలపై అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఈ సంధర్భంగా 5500లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. విక్రయించేందుకు నిల్వ ఉంచిన 50లీటర్ల నాటు సారాను స్వాధీనపరుచుకున్నారు.…

హైదరాబాద్

మంత్రులంతా తక్షణం రాజీనామా చేయాలి: శంకర్రావు

హైదరాబాద్‌: సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులంతా తక్షణం రాజీనామా చేయాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. కెప్టెన్‌ జట్టులో రెండో వికెట్‌ పడిపోయిందని, మరో ఆరు వికెట్లు కూడా అందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.…

వార్తలు

జింబాబ్వేపై భారత్‌ విజయం

టౌన్‌సిల్వే: అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచకప్‌ భాగంగా భారత్‌, జింబాబ్వేల మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. భారత్‌ ఉంచిన 262పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో జింబాబ్వే విఫలమైంది. 44.1ఓవర్లలో 198పరుగులకి ఆలౌటైంది. జింబాబ్వే మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ లేక్‌ అద్భుతంగా…

హైదరాబాద్

మంత్రిని కలిసిన గగన్‌ నారంగ్‌

హైదరాబాద్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో జాతీయ జెండాను రెపరెపలాడించిన హైదరాబాద్‌ షూటర్‌ గగన్‌నారంగ్‌ ఈ రోజు సచివాలయానికి వచ్చారు. సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ను కలిశారు. గగన్‌ భవిష్యత్తులో మరిన్ని పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ…

హైదరాబాద్

తిరుమలగిరి ఎస్‌బీహెచ్‌కాలనీలో వృద్దురాలి హత్య,బంగారం అపహరణ

సికింద్రాబాద్‌: నగరంలోని తిరుమలగిరి ఎస్‌బీహెచ్‌ కాలనీలో గుర్తు తెలియని దుండగులు వృద్దురాలిని కొట్టి దారుణంగా హత్య చేసి ఆమె నుంచి 10 తులాల బంగారం అపహరించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వార్తలు

విద్యార్థుల సమస్యలపై స్పందిచకపోతే ఆమరణ నిరాహర దీక్ష:కిషన్‌రెడ్డి

తిరుపతి: రాష్ట్రంలో యుద్దప్రాతిపదికన ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వం విద్యార్థుల పట్ల స్పందించని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని ప్రకటించారు. మంత్రులపై ఆరోపణలు వస్తున్న గవర్నర్‌ స్పందించకపోవటం బాధకరమని,…

హైదరాబాద్

ఉప్పల్‌లో చిట్టిల వ్యాపారి మోసం

హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌లో చిట్టీల వ్యాపారి రమేష్‌ రూ. కోటితో పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.