Tuesday, 3 November 2026

August 2012

వార్తలు

రెండు హెలికాప్టర్లు ఢీ: ఐదుగురి మృతి

గుజరాత్‌: వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

Featured News

కసబ్‌కు ఉరే సరి

కింది కోర్టు తీర్పులను సమర్థించిన సుప్రీం భారత్‌పై దండెత్తడమే అతి పెద్ద తప్పు మరణ శిక్షకు మించి మరోశిక్ష లేదు పాక్‌ భూభాగం పైనుంచే దాడులకు కుట్ర వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, ఆగస్టు 29 :ముంబై దాడుల…

వార్తలు

రాజ్యసభ మధ్యాహ్నాం 2 గంలకు వాయిదా

ఢిల్లీ: వాయిదా అనంతరం సమావేశమవుతూనే లోక్‌సభ మళ్లీ రేపటికి వాయిదా పడింది. బొగ్గు కంభకోణంపై సభలో చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడంతో సభ వాయిదా పడింది. ఇదే కారణంగా రాజ్యసభ సైతం మధ్యాహ్నాం రెండు గంటలవరకూ వాయిదా పడింది.

వార్తలు

పగిలిన ఓఎన్టీజీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం అడవిపాలెం వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ పగిలింది. దాంతో గ్యాస్‌ లీక్‌ అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్‌జీసీ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. గ్యాస్‌…

వార్తలు

కృష్ణా డెల్టా సమస్యపై గుంటూరులో అఖిలపక్ష రైతుల సమావేశం

గుంటూరు: కృష్ణా డెల్టా సమస్యపై గుంటూరులో అఖిలపక్ష రైతు కార్యాచరణ సమితి సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ డెల్టా సమస్యపై మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు. కృష్ణా డెల్టా సమస్యపై ఉద్యమాన్ని ఉద్థృతం…

వార్తలు

ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం

పశ్చిమగోదావరి: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కుంబపోతగా కురుస్తున్న వానకు కొయ్యలగూడెం మండలం వేదాంతపురంలో చెరువుకు గండి పడింది. దాంతో పలు పంటపొలాలు నీట మునిగాయి.

హైదరాబాద్

మూడు కేబుల్‌ టీవీ ఛానళ్లపై కేసు

హైదరాబాద్‌: అనుమతి లేకుండా ప్రసారాలు చేస్తున్న మూడు కేబుల్‌ టీవీ ఛానళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్రో, మెగా, మిర్చి మ్యూజిక్‌ అనే ఛానళ్లపై  సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

వార్తలు

ఉభమసభలు మధ్యాహ్నం 12 గం వరకూ వాయిదా

ఢిల్లీ:పార్లమెంటు ఉభయసభలు ఈరోజు ప్రారంభం అయిన కాసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. గత వారం రోజులుగా బొగ్గు కుంభకోణం వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న ఆందోళన సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తూ వాయిదాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే.  ఈరోజు…

హైదరాబాద్

సీబీఐ ఎదుట హాజరైన శ్రవణ్‌ గుప్తా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితుడు శ్రవణ్‌గుప్తా ఈ రోజు సీబీఐ ముందు హాజరయ్యారు. ఎమ్మార్‌, ఎంజీఎఫ్‌ ఎండీ అయిన శ్రవణ్‌గుప్తాను సీబీఐ నేడు విచారిస్తున్నట్లు సమాచారం.

ఎడిట్ పేజీ

ఉరితో ఊపిరి పీల్చుకోవద్దు.. భద్రతను పటిష్ఠపర్చాలి

అజ్మల్‌ కసబ్‌.. ఈ పేరు తెలియని వారు బహుశా దేశంలో ఉండరేమో. ఎందకంటే, అతను సాగించిన మారణకాండను ఏ భారతీయుడు అంత సులువుగా మరిచిపోలేడు. నవంబర్‌ 26, 2008లో ముంబయ్‌ మహానగరంలో ఉగ్రవాద బృందం జరిపిన దాడిపై అజ్మల్‌…