Tuesday, 3 November 2026

August 2012

హైదరాబాద్

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు

హైదరాబాద్‌: నగరంలోని మాసబ్‌ ట్యాంక్‌లోని ఎంసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ కేంద్రం వద్ద విద్యార్థి సంఘాలు కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌన్సెలింగ్‌ కేంద్రంలో చొరబడిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్థానికి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

వార్తలు

కూతురుతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్య

నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం శెట్టిపల్లిలో మూడేళ్ల చిన్నారితో సహా మహిళ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.…

వార్తలు

పశ్చిమగోదావరి జిల్లాలో పొండిపొర్లుతున్న వాగులు

బుట్టాయగూడెం: జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జల్లేరు, బైనేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి., దీంతో కాలువల్లో భారీగా నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా ఈమండలాల్లోని 30 గ్రామాలకు నిలిచిపోయినా రాకపోకలు.

వార్తలు

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: ఈరోజు స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి గంటలో సెన్సెక్స్‌ 90 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి.

హైదరాబాద్

లక్షలమందితో హైదరాబాద్‌ దిగ్భంధం: కోదండరాం

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా లక్షల మందితో హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామన్నారు. నాంపల్లిలోని టీఎస్‌జీఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వామిగౌడ్‌ సన్మానసభలో పాల్గొన్న ఆయన…

వార్తలు

చెరువులో పడిన స్కూలు బస్సు

ఏలూరు: ఏలూరు జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు వద్దఈ రోజు ఉదయం విద్యార్థులతో వెళుతున్న ఓ స్కూలు బస్సు చెరువులో పడింది. ఈప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి…

హైదరాబాద్

ఫీజు చెల్లింపుపై నేడు ప్రభుత్వ ప్రకటన

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కోర్సుల్లో కొత్తగా ప్రవేశం పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలలాంగ విద్యార్థులకు భోధన రుసుం పథకం కింద ఎంతమొత్తం చెల్లించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సృష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం…

జిల్లా వార్తలు

బీహెచ్‌ఈఎల్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల మెరకు సమ్మె

మెదక్‌: జిల్లాలోని బీహెచ్‌ఈఎల్‌ రామచంద్రాపురం యూనిట్‌లో రెండు వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. తనిఖీల పేరుతో కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగులను సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బింది వేధిస్తున్నారని ఆరోపించారు. మహిళలను వేధించిన సిబ్బందిని తొలగించే వరకు సమ్మె…

హైదరాబాద్

లారీ-బైక్‌ ఢీ కొన్ని ఒకరి మృతి

హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌ చౌరస్తాలో బైక్‌ను లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  

జిల్లా వార్తలు

నేడు మెదక్‌ జిల్లాలో పీఏసీ కమిటీ పర్యటన

మెదక్‌: ఈ రోజు శాసనసభా ప్రజా పద్దుల సంఘం మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌లో పర్యటించనుంది. జిల్లాలో దళితులకు పంచిన భూములు అన్యాక్రాంతం అయిన విషయంపై ఈ కమిటీ విచారణ చేపట్టనుంది.