Monday, 2 November 2026

August 2012

వార్తలు

రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరుకు గాయాలు

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌ గౌర్‌  రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఎచ్చెర్ల మండలం సనపలవాలనిపేట సమీపంలో జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టరు ఢీకొనడంతో కలెక్టరు సౌరభ్‌ గౌర్‌కు గాయాలయ్యాయి.…

ఖమ్మం

కరెంటు షాక్‌తో దంపతుల మృతి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ములకలపల్లి మండలం చింతలపాడులో విద్యుదాఘాతంతో దంపతులిద్దరూ మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. తీగలపై బట్టలు ఆరేస్తుండగా కరెంటు షాక్‌ కొట్టి భార్య మృతించెందగా ఆమెను కాపాడబోయి భర్తకూడా మృత్యువాత పడ్డాడు.

హైదరాబాద్

డెక్కన్‌ క్రానికల్‌ అధినేతపై చీటింగ్‌ కేసు నమోదు

హైదరాబాద్‌: డెక్కన్‌ క్రానిక్‌ పత్రిక అధినేత వెంకట్రామిరెడ్డిపై సీసీఎస్‌ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు.  కార్వీ సంస్థ ప్రతినిధులు ఆయనపై ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్‌ 420, 468, 406, 417 ప్రకారం పోలీసులు అభియోగాలు నమోదు…

వార్తలు

ఉత్తర, తూర్పు ఈశాన్య గ్రిడ్లలో విద్యుత్‌ పునరుద్దరణ

ఢిల్లీ: ఉత్తర, తూర్పు ఈశాన్య గ్రిడ్లలో అధికారులు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించారు. ఐదు ప్రాంతాల్లోనూ నూరు శాతం విద్యుత్‌ సరఫరా పునరుద్దరించినట్లు ప్రధాన పంపిణీ సంస్థ ప్రకటించింది. సోమవారం అర్థరాత్రి ఉత్తరాది గ్రిడ్‌ వైఫల్యంతో మొదలైన విద్యుత్‌…

వార్తలు

అడవుల దీవి నుంచి సీపీఐ రైతు పోరుబాట ప్రారంభం

గుంటూరు: గుంటూరు జిల్లా అడవుల దీవినుంచి సీపీఐ పోరుబాట ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వాన్‌పిక్‌ ఒప్పందాలు పూర్తిగా రద్దుచేసి రైతులకు భూములు అప్పగించాలన్నారు. వాన్‌పిక్‌ భూముల్ని ఆయన ట్రాక్టర్లతోదున్నారు.

హైదరాబాద్

జయశంకర్‌ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని తెలంగాణ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేసింది.  జయశంకర్‌ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలని కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్‌ చేసింది.

ఆదిలాబాద్

విద్యుత్తు కోతను నిరసిస్తూ రైతుల ధర్నా

నిర్మల్‌: నిర్మల్‌ మండలం సోన్‌ ఉప విద్యుత్తు కేంద్రం వద్ద విద్యుత్తు కోతను నిరసిస్తూ రెండు గంటల పాటు రైతులు ధర్నా చేశారు. రాత్రి సమయంలో విద్యుత్తు కోత విధించటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని జాఫ్రాపూర్‌, కర్తాల్‌,…

ఆదిలాబాద్

డయేరియాతో బాలిక మృతి

ఇందవెల్లి: మండలంలోని కాటగూడ గ్రామానికి చెందిన సోంబాయి(6)అనే బాలిక డయేరియా వ్యాధితో మృతి చెందింది. ఈమెతో పాటు గ్రామంలో మరో ముగ్గురు డయేరియా భారిన పడి అస్వస్థతకు గురయ్యారు.

ఆదిలాబాద్

నేడు ప్రాణహిత నుంచిరైతు పోరుబాట

కాగజ్‌గనర్‌: రైతు సమస్యల పరిష్కారానికి బుధవారం నుంచి రైతు పోరుబాటను ప్రారంభించనున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బద్రిసత్యనారాయణ తెలిపారు. దీన్ని కౌటాల మండలంలోని తుమ్డిహేటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని…

ఆదిలాబాద్

రేపటిలోగా పాఠ్యపుస్తకాలు అంతటా చేరాలి

అదిలాబాద్‌: పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు ఈనెల 2వ తేదీలోగా పంపిణీ చేయాలని ఈఈవో అక్రముల్లాఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే ప్రాధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.