Monday, 2 November 2026

August 2012

కరీంనగర్

కానిపర్తిలో విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్లను ద్వసంచేసి కాపర్‌వైరు-అపహరణ

కరీంనగర్‌: కమలాపూర్‌ మండలంలోని కానిపర్తిలో గురువారం రాత్రి 4విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ద్వంసం చేసి కాపర్‌ వైరును దుండగులు అపహరించినట్లు గ్రామాస్థులు తెలిపారు.

హైదరాబాద్

విద్యుత్‌ కోతలపై గవర్నర్‌ను కలవనున్న తెదేపా టీడీపీ

హైదరాబాద్‌: ప్రజాసమస్యలు, విద్యుత్‌ కోతలపై తెదేపా నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. ఈ ఉదయం పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గవర్నర్‌ను కలిసి సమస్యల తీవ్రతను…

వార్తలు

కుడంకుళం అణు విద్యుత్‌ కేంద్రంలోని 1,2 యూనిట్ల ప్రారంభానికి కోర్టు అనుమతి

చైన్నై: తిరునెల్వేలి జిల్లాలోని కుడంకుళం అణు విద్యుత్‌ కేంద్రానికి కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై కోర్టు ఈ తీర్పునువెలువరించింది. దీంతో ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు పిటిషనర్లు తెలియజేశారు.

వార్తలు

కేకే మార్గంలో తెగిపడ్డ విద్యుత్‌ తీగలు

విశాఖ: కొత్తవలస-కిరండోల్‌ (కేకే) మార్గంలో విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఈ మార్గంలో చిమిలిగూడ వద్ద ప్యాసింజర్‌ రైలును అధికారులు నిలిపివేశారు. దీంతో పలు గూడ్స్‌రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వార్తలు

పార్లమెంట్‌ ఉభయసభలు సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం అంశంపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం వాయిదా అనంతరం లోక్‌ సభ ప్రారంభంకాగానే విపక్ష సభ్యులు బొగ్గు కుంభకోణానికి నైతిక భాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సభ్యులు…

కరీంనగర్

90వేల టేకు మొక్కల పెంపకానికి 15లక్షల నిధులు మంజూరు

గంగాధర: మండలంలో ఉపాధిహామి పథకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో 90వేల టూకు మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందెకోసం 15లక్షల రూపాయాలు మంజూరైనట్లు తెలిపారు.

కరీంనగర్

భారీ వర్షానికి గంగాధరలో కూలిన ఇళ్లు-500ఎకరాల పంట మునక

కరీంనగర్‌: గంగాధరలో భారీ వర్షం కారణంగా సిమత్‌నగర్‌, తాడిజర్రి గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. గంటపాటు కురిసిన వర్షానికి 500ఎకరాల్లో పంటలు మునిగి పోయాయి.

ఆదిలాబాద్

ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లో రికార్డుల తనిఖీ

ఆదిలాబాద్‌: తిర్యాణి మండలంలోని చెలిమెల ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ కలెక్టర్‌ గట్టయ్య, తిర్యాణి ఐటీడీఏ పాఠశాలలో బీసీ కమిషన్‌ అధికారి బస చేశారు. రికార్డులను తనిఖీ చేసి భోజనవసతుల గురించి తెలుసుకున్నారు.

జిల్లా వార్తలు

జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐరన్‌ మాత్రాలు వికటించి విద్యార్థికి అస్వస్థత

గుంటూరు: కారంపూడి ఆరోగ్య కేంద్రం పరిధిలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం ఐరన్‌ మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఆ మాత్రలు మింగిన 7వ తరగతి విద్యార్థి సాగినబోయిన వెంకటేష్‌ వాంతులతో అస్వస్థతకు గరయ్యాడు.

సీమాంధ్ర

జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

విజయవాడ: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవాలు అందించటానికి సరైన మార్గదర్శకాలు లేవని గత 3రోజులుగా ఆందోళన చేస్తున్న జూడాల ఎన్టీయర్‌ హెల్త్‌యూనివర్శిటీని ముట్టడించి ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్యశాఖకు వ్యతిరేకంగా నినదాలు చేశారు. మా సమస్యలు వీసీ పరిష్కరించాలని కోరారు.…