Thursday, 5 November 2026

August 2012

Cover Story

తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌

జీవిత విశేషాలతో ‘ఒడవని ముచ్చట్లు’ లండన్‌లో పుస్తకావిష్కరణ ఆవిష్కరణ లండన్‌,ఆగస్టు21(జనంసాక్షి): తెలంగాణకు జాతిపిత ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌ ఫౌండర్‌, మెంబర్‌ గంట వేణుగోపాల్‌ అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జీవిత విశేషాలు, అనుభవాలపై కొంపల్లి వెంకట్‌…

హైదరాబాద్

రేపు విద్యుత్‌ సౌధ ముట్టడి-టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌

హైదరాబాద్‌: కరెంట్‌ సరఫరా విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు విద్యుత్‌ సౌధ ముట్టడికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేెందర్‌ పిలుపునిచ్చారు. జిల్లా, మండల కేంద్రాల్లో రాస్తారోకోలు, సబ్‌స్టేషన్లను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజలు ముట్టడించాలని పిలుపునిచ్చారు. రౖౖెతుల పొలాలు…

ఖమ్మం

ఉప్పొంగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రచలం : గోదావరి నీటిమట్టం 44.2 అడుగులకు చేరింది. భధ్రచలం లోని అశోక్‌ నగర్‌, కొత్త కొలనీలోకి వరద నీరు చేరింది. 35 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రేపు ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 48…

హైదరాబాద్

టెస్ట్‌ క్రికెట్‌ సిరీస్‌ ట్రోఫీని ఆవిష్కరించిన భారత్‌,న్యూజిలాండ్‌ కెప్టెన్లు

హైదరాబాద్‌:భారత్‌ న్యూజిలాండ్‌ మధ్య ఈ నెల 23 నుంచి జరగనున్న ఎయిర్‌టెల్‌ టెస్ట్‌ క్రికెట్‌ సిరీస్‌ ట్రోఫీని ఇరుజట్ల కెప్టెన్లు మహెంద్రసింగ్‌ ధోని, రాస్‌ టేలర్‌ ఆవిష్కరించారు. హైదరాబాద్‌ తాజ్‌ కృష్ణాలో ఎయిర్‌టెల్‌ ఏపీ సీఈవో చార్లిస్‌ తాయిల్‌…

హైదరాబాద్

రింగు రోడ్డుపై స్పోట్స్‌ కారు బోల్తా : ఒకరు మృతి

హైదరాబాద్‌ శామీర్‌పేట రింగు రోడ్డు లో స్పోట్స్‌ కారుబోల్తాపడింది.ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.మృతి చెందిన వ్యక్తి మాజీ మంత్రి పులి వీరన్న పెద్ద కుమారుడు ప్రవీణ్‌ తేజ మృతి.

జాతీయం

జాతీయ జెండాను అవమానించారంటూ షారుక్‌ఖాన్‌ పై కేసు నమోదు

పుణె: జాతీయ జెండాను అవమానించారంటూ బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ పై పోలిసులు కేసు నమోదు చేశారు. యూట్యూబ్‌లో వీడియోలో షారుక్‌ జాతీయ జెండాను అవమానించారని లోక్‌జనశక్తి పార్టీ జాతీయ కార్యదర్శి రవి బ్రహ్మే ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు…

హైదరాబాద్

గాంధీ ఆస్పత్రిలో జూడాల ర్యాలీ

హైదరాబాద్‌: తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గాందీ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సరైన వైద్యం అందించలేదని ఆరోపిస్తూ ఒక రోగి బంధవులు ఈరోజు…

జాతీయం

రేపు సమావేశం కానున్న యూపీఏ సమన్వయ కమిటీ

డిల్లీ: రేపు సాయంత్రం డిల్లీలోని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో యూపీఏ భాగస్వామ్య పక్షాల సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరు కానున్నట్లు సమాచారం.

సీమాంధ్ర

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ మూడో బోగీలో మంటలు,భయాందోళనలో ప్రయాణికులు

నెల్లూరు: తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ మూడో బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను రైల్వే గార్డులు గుర్తించారు. పొగలు దట్టంగా కమ్ముకోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.

వరంగల్

కేయూ పీజీ కౌన్సిలింగ్‌ వాయిదా

వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీలో రేపటి నుంచి జరగాల్సిన మూడో విడత పీజీ కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు వర్సీటీ అధికారులు తెలిపారు. అధ్యాపకులు ఆందోళన కారణంగానే కౌన్సిలింగ్‌ వాయిదా వేశామని అధికారులు తెలిపారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.