Friday, 6 November 2026

September 2012

జిల్లా వార్తలు

విజయమ్మ నివాసంలో కవిత

హైదరాబాద్‌: శాసనసభ ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లోటాస్‌పాండ్‌లోని వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నివాసంలో కలిశారు. ఈ నెల 17నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల…

ఎడిట్ పేజీ

సెప్టెంబర్‌ 30 తర్వాత సమరశీల పోరాటం…

తెలంగాణ ప్రజల 56 ఏళ్ల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి, గత మూడేళ్లుగా ప్రకటించిన తెలంగాణను ఏర్పాటు చేసేందుకు తండ్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నరు..ఇపుడు తెలంగాణ బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న ఓ…

వార్తలు

నగల దుకాణంలో భారీ చోరీ

గుంటూరు: నగల దుకాణంలో భారీ చోరీ జరిగిన ఘటన గురజాలలోని కొట్లా బజారులో చోటుచేసుకుంది. ఇక్కడి ఓ నగల దుకాణంలో చోరులు కిలో బంగారం దొంగిలించారు. పోలీసులు  కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వార్తలు

నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు

విశాఖపట్నం: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని జోలాపుట్‌ వద్ద నలుగురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1.50 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా వార్తలు

విమాన ప్రయాణికుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం

రంగారెడ్డి: శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న  భద్రతా సిబ్బంది ఓ వ్యక్తి నుంచి  రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన హనుమంతరావు అనే వ్యక్తి విశాఖపట్నం వెళ్తోండగా ఆయన నుంచి పోలీసులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.…

వార్తలు

తమ్మిలేరు జలాశయంలోకి భారీగ వరద నీరు

చాట్రాయి: ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లా తమ్మిలేరు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం లాకులు ఎత్తి దిగువకు 4,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. జలాశయంలోకి ఇన్‌ఫ్లో…

వార్తలు

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మాక్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 90 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నీఫ్టీ కూడా 31 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

వార్తలు

భారీగా ఎచ్రందనం దుంగలు పట్టివేత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్యగారిపాలెం సమీపంలో స్వర్ణముఖి వాగులో పాతి పెట్టిన సుమారు 100కు పైగా ఎర్రచందనం దుంగలను స్పెషల్‌ బ్రాంచి పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు. రూ. కోటిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.…

వార్తలు

నేడు తితిదే పాలకమండలి భేటీ

తిరుమల : తితిదే నూతన పాలకమండలి తొలి సమావేశం నేడు జరగనుంది. అన్నమయ్య భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తిరుమలలో నీటి కొరత, అధికమాస బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తదితర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.

హైదరాబాద్

వైఎస్‌ విజయను కలిసిన కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయను కలుసుకున్నారు. అసెంబ్లీ అవరణలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి చేస్తున్న కృషికి  మద్దతు ఇవ్వాలని విజయను కవిత కోరారు.