Thursday, 5 November 2026

September 2012

వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

విశాఖపట్నం: రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల  కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే…

వార్తలు

విశాఖలో భారీవర్షం

విశాఖపట్నం: నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు నీటి మునిగాయి. వేపగుంట సాయిదుర్గానగర్‌, నరవరామాలయవీధుల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. వర్షం కారణంగా ఏసీఏవైఎస్‌ఆర్‌ స్టేడియాంలో భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దయింది.…

హైదరాబాద్

జూనియర్‌ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు సఫలం

హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్లతో ప్రభుత్వం రెండో దఫా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ చర్చలో తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిదని జూనియర్‌ డాక్టర్ల సంఘం ప్రతినిధులు ప్రతినిధులు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో…

వార్తలు

18 గిరిజన గ్రామాలకు స్తంభించిన రాకపోకలు

ఏలూరు: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటితో పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. నదిలో నీటి ఉద్థృతి పెరగడంతో సమీప గ్రామాలు వరద భయంతో వణికిపోతున్నాయి. పోలంవరం మండలంలోని 18 గిరిజన గ్రామాలకు రాకపోకలు…

హైదరాబాద్

రేషన్‌ బియ్యం పట్టివేత

హైదరాబాద్‌: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న లారీని ఈ రోజు ఉదయం ఆటోనగర్‌లో పోలీసులు పట్టుకున్నారు. లారీలో సుమారు 17 టన్నుల రేషన్‌ బియ్యం ఉన్నట్లు సమాచారం. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

వార్తలు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు

శ్రీశైలం: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరదనీటితో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం ఇన్‌ఫ్లో 1.60 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 847.40 అడుగులకు చేరుకుంది.

వార్తలు

‘శివకాశి’ ఘటనలో ఆరుగురి అరెస్టు

శివకాశి: ఓంశక్తి బాణసంచా పరిశ్రమలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధించి పరిశ్రమ నిర్వాహకుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్

ధియేటర్‌ వద్ద బాలకృష్ణ అభిమానుల ధర్నా

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని ఓ ధియేటర్‌ వద్ద బాలకృష్ణ అభిమానుల ఆందోళన  చేపట్టారు ‘శ్రీమన్నారాయణ ‘ చిత్రాన్ని తీసివేసి మరో చిత్రాన్ని  వేయడంతో చిత్ర యూనిట్‌ సహా అభిమానులు ధర్నా చేస్తున్నారు.

వార్తలు

నేడు రాష్ట్రపతి, ప్రధానితో చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ: బీసీ డిక్లరేషన్‌పై చర్చించేందుకు తేదేపా అధినేత చంద్రబాబు నేడు రాష్ట్రపతి. ప్రధానమంత్రులతో విడివిడిగా భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానమంత్రితో, సాయంత్రంతో 6.30 గంటలకు రాష్ట్రపతితో చంద్రబాబు సమావేశమవుతారు.

హైదరాబాద్

నేటి నుంచి విజయమ్మ ‘ఫీజు పోరు ‘

హైదరాబాద్‌: వృతి విద్యా కళాశాలల్లో విద్యార్థులకు చెల్లించాల్సిన బోథనా రుసుములను ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ నేటి నుంచి దీక్ష చేపప్టనున్నారు. ‘ఫీజు పోరు ‘ పేరుతో నిర్వహిస్తున్న ఈ…