Wednesday, 4 November 2026

September 2012

జిల్లా వార్తలు

యూరియాకోసం తోపులాట: లాఠీఛార్జీ

తాండూరు:రంగారెడ్డి జిల్లాలో యూరియాకోసం రైతుల మధ్య జరిగిన తోపులాట లాఠీఛార్జీకి దారితీసింది. తాండూరులో ఈరోజు యూరియాకోసం రైతులు తెల్లవారుజామునుంచే బారులు తీరారు. యూరియా తక్కువగా ఉన్నట్లు ప్రచారం కావటంతో ఓ రైతుకు గాయాలయ్యాయి. ఆదిలాబాద్‌లో కూడా రైతులు ఎరువులకోసం…

జిల్లా వార్తలు

అత్తింటివారిపై గొడ్డలితో దాడి

నిజామాబాద్‌: జిల్లాలోని సిరికొండ మండలం చిన్నవల్లూరులో ఓ అల్లుడు అత్తింటి వారిపై గొడ్డలితో దాడిచేశారు. ఈ దాడిలో అత్త మృతి చెందగా మరదలి పరిస్థితి విషమంగా ఉంది.అనంతరం ఆయన కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వార్తలు

అనంతపురం సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయంలో కుంభకోణం

అనంతపురం: జిల్లా సబ్‌ రిజష్ట్రార్‌ కార్యాలయంలో రూ.34 లక్షల కుంభకోణం జరిగింది. రాజారత్నం అనే ఉద్యోగి భూముల రిజిస్ట్రేషన్‌ను తక్కువడాచూపి 34 లక్షల కాజేసినట్లు తేలటంతో ఆథికారులు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదుచేశారు.

వార్తలు

పన్ను చట్టంలో స్పష్టమైన విధానం : చిదంబరం

ఢిల్లీ: పన్ను చట్టంలో నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా స్పష్టమైన విధానం తీసుకొస్తామని ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో పన్ను ఆదాయం 12 శాతం సాధించటమే లక్ష్యమని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో…

వార్తలు

బెంగళూరులో మరొకరి అరెస్టు

బెంగళూరు: ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో బెంగళూరు నగరంలో పోలీసులు వస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నయిమ్‌ సిద్ధిఖ్‌ అనే వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద…

హైదరాబాద్

కర్ణాటకకు ప్రత్యేక బలగాలు: పోలీస్‌ కమిషనర్‌

హైదరాబాద్‌: తీవ్రవాదుల అరెస్ట్‌ నేపథ్యంలో కర్ణాటకకు ప్రత్యేక బలగాలను పంపుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలియజేశారు. బెంగుళూరులో అరెస్టయిన హుజీ తీవ్రవాదులకు రాష్ట్రంలో సంబంధాలపై ఆరా తీస్తారని ఆయనర తెలిపారు.హుజీ తీవ్రవాదసంస్థ జాబితాలో ఉన్న జాడలు లేవన్నారు.…

జిల్లా వార్తలు

ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌కు సహకరించాలి

కళాశాలల బంద్‌కు సహకరించాలి సంగారెడ్డి: అవినీతి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ నెల 4న నిర్వహిస్తున్న కళాశాలల బంద్‌ను జయప్రదం చేయాలని జిల్లా ఏబీవీపీ నేతలు తెలిపారు.

జిల్లా వార్తలు

ఇంజనీర్స్‌-డే సంధర్భంగా విద్యార్థులకు క్రీడలు పోటీలు

సిద్దిపేట: ఇంజనీర్స్‌-డే సంధర్భంగా విద్యార్థులకు క్రీడలు పోటీలు నిర్వమించనున్నట్లు ఏబీవీపీ తెలిపింది. ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, బీఫార్మసీ విద్యార్థులకు ఈ నెల 15న క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.