Monday, 2 November 2026

September 2012

వార్తలు

ఎర్రచందనం పట్టివేత

కడప: కోడూరులో అక్రమంగా వాహనంలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ. కోటి ఉంటుందని తెలియజేశారు. స్మగ్లర్లు వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పరారైనట్లు చెప్పారు.

వార్తలు

రెండు వికేట్లు కోల్పోయిన భారత్‌

బెంగళూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి. 40 పరుగులు చేసింది.  కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభంలోనే గంభీర్‌ వికెట్‌ను కోల్పోయింది. సౌతీ బౌలింగ్‌లో గంభీర్‌…

హైదరాబాద్

సీఐఎస్‌ఎఫ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న షిండే

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సుశీల్‌ కుమార్‌ షిండే ఈ ఉదయం హకీంపేటలో జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీ (సీఐఎస్‌ఎఫ్‌)లో జరిగిన ఓ కార్యాక్రమానికి హాజరయ్యారు. సీఐఎస్‌ఎస్‌ పాసింగ్‌ …

Featured News

తెలంగాణ అన్నప్పుడే వేరే ఉద్యమాలు: నారాయణ

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడే వేరే ఉద్యమాలు వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. రాయలసీమ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎప్పుడూ లేవని ఆయన తెలియజేశారు. కాగా, సెప్టెంబర్‌ 30న నిర్వహించే’ హైదరాబాద్‌ మార్చ్‌’కు తాము సంపూర్ణంగా మద్దతునిస్తామని…

హైదరాబాద్

చర్లపల్లి జైల్లో నిరసన

హైదరాబాద్‌: చర్లపల్లి జైల్లో కర్ణాటక ఎమ్మెల్యేలు సోమశేఖరరెడ్డి , సురేశ్‌బాబు నిరసనకు దిగారు. జైలు అధికారికి లంచం ఇవ్వనందుకే బ్యారక్‌లో తనిఖీలు చేపట్టి డబ్బు పట్టుకున్నారని ఆరోపించారు. గాలి బెయిల్‌ ముడుపుల  కేసులో ఎమ్మెల్యేలు అరెస్టయిన విషయం తెలిసిందే.

ఎడిట్ పేజీ

తెలంగాణ మొత్తం ఖుల్లా !

దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనైనా.. ఏ జిల్లాలోనైనా.. ఏ మండలంలోనైనా.. ఆఖరికి ఏ గ్రామంలోనైనా ఏదైనా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపాలని నిర్ణయిస్తే, సామాన్య జనజీవనాన్ని స్తంభింప చేసి, తామూ పోటీలో ఉన్నామని, తమ ఉనికిని…

వార్తలు

365 పరుగులకు న్యూజిలాండ్‌ ఆలౌట్‌

బెంగళూరు: భారత్‌తో  జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 365 పరుగులకు ఆలౌటయింది. 328 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో  రెండోరోజు బరిలోకి దిగిన కివీస్‌ జట్టు 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెహ్వాగ్‌, గంభీర్‌తో భారత్‌  ఇన్నింగ్స్‌ను…

వార్తలు

అత్యవసరంగా విమానం దించివేత

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో శనివారం ఉదయం స్పైస్‌జెట్‌ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. టేకాఫ్‌ అవుతున్న సమయంలో పక్షి తగలడాన్ని గుర్తించిన అధికారులు వెంటనే విమానాన్ని దించి వేశారు.

వార్తలు

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

చిత్తూరు: రైలు కింద పడి ఓ ప్రేమ జంట శనివారం ఉదయం చిత్తూరు రైల్వే స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన ప్రియురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు…

కరీంనగర్

అతిసారంతో వ్యక్తి మృతి

కరీంనగర్‌: ఎలిగేడు మండలంలో అతిసారం ప్రబలుతోంది. మండలంలోని దూలికట్టలో అతిసారంతో శనివారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో పది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.