Tuesday, 3 November 2026

September 2012

వార్తలు

కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రం అత్యంత భద్రతతో ఏర్పాటు చేస్తున్నాం: సుప్రీంకోర్టు

చెన్నై: తిరునేల్వేలి జిల్లాఓని కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రాన్ని ప్రజల భద్రత దృష్ట్యా అవసరమైతే మూసివేతకు కూడా ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేంద్రాన్ని మూసివేయాలని కోరుతూ ఇంజినీరు సుందరరాజన్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ గురువారం…

వార్తలు

కేసీఆర్‌తో ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ భేటీ

ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావుతో ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ గరువారం రాత్రి భేటీ అయ్యారు. కేసీఆర్‌తో ఫెర్నాండెజ్‌ అరగంటపాటు చర్చలు జరిపారు.

వార్తలు

మాజీ మంత్రి అమిత్‌ షాకు బెయిల్‌ రద్దు కుదరదు: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సొహ్రాబుద్దీన్‌ షేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న గుజరాత్‌ మాజీ మంత్రి అమిత్‌ షాకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఈ మేకు సీబీఐ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే, విచారణ నిస్పక్షపాతంగా…

వార్తలు

ఇంగ్లాండ్‌ లక్ష్యం 180

పల్లెకిలె: టీ 20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్మ జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌చేసిన వెస్టిండీస్‌ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులుచేసింది. వెస్టిండీస్‌ ఆటగాళ్లు చార్లెన్‌ 84, గేల్‌ 58, శ్యామూల్స్‌ 2, పొల్లార్డ్‌ 1,…

వార్తలు

రైల్వే వ్వవస్థను ప్రైవేటీకరించటానికి ప్రభుత్వం సిద్ధం: శంకరావు

గుంతకల్లు: రైల్వే వ్వవస్థను ప్రైవేటీకరించటానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీన్ని అడ్డుకోవటానికి కార్మికులు ఉద్మమాలకు సిద్ధపడాలని రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ సికింద్రాబాదు జోనల్‌ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ శంకరావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్మికులు…

వార్తలు

నకిలీ గుర్తింపు కార్డుతో ఇస్రో మహిళ కేసులో విచారణ

బెంగళూరు: నకిలీ గుర్తింపు కార్డుతో ఇస్రో ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించిన అనుమానాస్పద మహిళ బ్యూలా ఎం. శ్యామ్‌ (40) కేసులో నగర పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆమె బెంగళూరు పోలీసు కస్టడీలో ఉన్నారు. ఆమె తెలిపిన…

వార్తలు

ఉషామెహ్రా కమిటీ సిఫార్సులు అమలుచేయాలి: చంద్రబాబు

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉషామెహ్రా కమిటీ సిఫార్సులు అమలుచేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాయనున్నట్టు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. వర్గీకరణపై మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఏర్పాటుచేసిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బాబు ప్రసంగిస్తూ వర్గీకరణ…

వార్తలు

జంటనగరాలకు 29న సెలవు

హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 29న సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 29 సెలవుకు బదులు అక్టోబర్‌ 13న కార్యాలయాలు, పాఠశాలలు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

వార్తలు

బాబు తలపెట్టిన ‘వస్తున్నా మీకోసం’ యాత్రకు మంద కృష్ణమాదిగ మద్దతు

హైదరాబాద్‌: చంద్రబాబు తలపెట్టిన ‘వస్తున్నా మీకోసం’ యాత్రకు ఎమ్మార్పీఎస్‌ వ్వవస్థాపక అధ్మక్షుడు మంద కృష్ణమాదిగ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ యాత్రకు మాదిగలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీవర్గీకరణ చేయకపోతే కాంగ్రెస్‌ పార్టీని మాదిగలు భూస్థాపితం చేస్తారని…

వార్తలు

కవాతుకు అనుమతి విషయంపూ సీఎం హోమంత్రి, ఇంఛార్జీ డీజీపీ భేటీ

హైదరాబాద్‌: కృష్ణా జిల్లాలో ఇందిరమ్మ బాట ముగించుకుని కాసేపటిక్రితమే హైదరాబాద్‌ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశాల పరంపర ప్రారంభించారు. తొలుత ఆయన హోంమత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంఛార్జి డీజీపీ దినేశ్‌రెడ్డిలతో భేటీ అయ్యారు. తెలంగాణ కవాతుకు అనుమతి విషయంపై…