Thursday, 5 November 2026

September 2012

వార్తలు

చెలరేగిన గేల్‌: అస్ట్రేలియా టార్గెట్‌ 192 పరుగులు

కొలంబో: ఆస్ట్రేలియా ముందు వెస్టిండ్‌స్‌ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. క్రిస్‌ గెల్‌ చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో అర్థసెంచరీ చేశాడు. మర్లోన్‌ శామ్యూల్స్‌ కూడా అర్థ సెంచరీ సాధించాడు. వాట్సన్‌ క్రిస్‌ గెల్‌ను అవుట్‌ చేయడంతో…

వార్తలు

మెక్సికోలో భూకంపం

మెక్సికో: ఉత్తర మెక్సికోలలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భూకంప కేంద్రం మెక్సికోకు 340 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు.

వార్తలు

వెస్టిండీస్‌ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు

కొలంబో: టీ-20 ప్రపంచకప్‌ గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వెస్డిండీస్‌ 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ ఆటగాళ్లు గెల్‌, శ్యామూల్స్‌ అర్ధసెంచరీలు సాధించారు.

వార్తలు

ఆస్కార్‌ అవార్డుకు ‘బర్పీ’ చిత్రం ఎంపిక

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆస్కార్‌అవార్డుల నామినేషన్‌కు రణబీర్‌కపూర్‌, ప్రియాంకచోప్రా తదితరులు నటించిన బర్ఫీ చిత్రం ఎంపికయింది. ఉత్తమ విదేశీచిత్రంక కేటగిరి నామినేషన్‌ కోసం ఈ చిత్రాన్ని తీసుకున్నారు.

వార్తలు

విత్తనచట్టం ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విత్తనచట్టం ముసాయిదా రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరువిభాగాల సభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు వ్వవసాయ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులుజారీ చేశారు. చట్ట రూపకల్పనలో అందరి అభిప్రాయాలు తీసుకుంటామని రాష్ట్ర వ్వవసాయశాఖమంత్రి కన్నా…

వార్తలు

ఈ నెల 28న సోంపేటపై మెజిస్ట్రీయల్‌ విచారణ

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కాకరాపల్లిలో జరిగిన పోలీసు కాల్పులపై మెజిస్టీరియల్‌ విచారణ ఈ నెల 28 న జరగనుందని కలెక్టర్‌ తెలిపారు. విచారణ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ వ్వవహరించనున్నారు.

వార్తలు

అక్టోబర్‌ 2నుంచి చంద్రబాబు పాదయాత్ర

హైదరాబాద్‌: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అక్టోబర్‌ 2 నుంచి నిర్వహించనున్న పాదయాత్రకు వస్తున్నా మీకోసం అని పేరుపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన పార్టీ పెద్దల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వార్తలు

దక్షణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులు

హంబస్‌టోట: టీ-20 ప్రపంచకప్‌లో శ్రీలంక- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్‌ను 7 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు…

వార్తలు

ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సమావేశం

హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసమివేశం సచివాలయంలో జరిగింది. ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న హైకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో…

వార్తలు

ఈ నెల 26న న్యూఢిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన

న్యూఢిల్లీ: దేశ చిల్లరవ్యాపారంలోకి విదేశీప్రత్యక్ష పెట్టుబడులును అనుమతించాలన్న కేంద్రం నిర్ణయంపై పార్లమెంటులో తీర్మానం ప్రతిపాదాంచాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్ణయించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తీర్మానాన్ని ప్రతిపాదంచనున్నట్టు మాజీ మంత్రి సౌగతరాయ్‌ వెల్లడించారు. ఈనెల 26న న్యూఢిల్లీలో తృణమూల్‌ కాంగ్రెస్‌…