Thursday, 5 November 2026

October 2012

హైదరాబాద్

పోలవరం టెండర్ల వివాదంపై విచారణ వచ్చేనెల 5కు వాయిదా

హైదరాబాద్‌: పోలవరం టెండర్ల వివాదంపై వచ్చేనెల 5కు హైకోర్టు వాయిదా  వేసింది. ఈ వివాదంపై నవంబరు 5లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

హైదరాబాద్

రోడ్లు, భవనాలశాఖపై అంచనాల కమిటీసమీక్ష

హైదరాబాద్‌: శాసనసభ కమిటీ హాలులో రోడ్లు,భవనాల శాఖపై అంచనాల కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లకు రావాల్సిన కేంద్ర నిధులు ఆగిపోవటంపై త్వరలో ఢిల్లీ వెళ్లాలని అంచనాల కమిటీ నిర్ణయించింది. ట్యాంక్‌బండ్‌, దుబ్బాకలోని సౌరవిద్యుత్‌…

ఆదిలాబాద్

మద్దతు ధర కోసం ర్యాలీ

తలమరుగు : పత్తి మద్దతు ధర కల్పించాలని డిమాండు చేస్తూ సోమవారం రైతులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. సుంకిడి, కుతాలపూర్‌ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు జిల్లా కేంద్రానికి ర్యాలీగా వెళ్లారు.

కరీంనగర్

ముళ్ల పోదల్లో చిన్నారి

మెట్‌పల్లి : నెలలు నిండని పసిపాపను ముళ్ల పోదల్లో కర్కశంగా పడేసిన సంఘటన మెట్‌పల్లి మండలంలో జరిగింది. సట్టణంలోని గాజులపేటలో ఉదయం చెట్ల పోదల్లోంచి ఓ పసిపాప ఏడుపు వినిపించడంతో చుట్టుపక్కల వారు గమనించి అపాపను బయటకు తీశారు.…

జిల్లా వార్తలు

ఆపదలో రక్తదానం

నిజామాబాద్‌ రక్తదానం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి గొప్ప అవకాశమని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్‌ దుగుల్‌ అన్నారు ఆయన పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమావారం పోలీసు కార్యలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎస్పీతో పాటు వంద మంది…

హైదరాబాద్

బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగుల ఆందోళన

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రోగులు ఆందోళనకు దిగారు. ధృవీకరణ పత్రం పేరిట ఆర్యోగ సేవలను వైద్యులు నిలిపివేశారు. రోగులకు వైద్యం అందించాలని రోగుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

హైదరాబాద్

చంచల్‌గుడా జైలులో కుక్కరు పేలి ముగ్గురికి గాయాలు

హైదరాబాద్‌: చంచల్‌గుడా జైలులో కుక్కరు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు ఖైదీలు, ఒక వార్డర్‌ గాయపడ్డారు. ఈ ఉదయం వంట చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలియజేశారు.

ఆదిలాబాద్

విద్యుత్‌ కోతలు నిరసిస్తూ అధికారుల నిర్డంధం

లక్ష్మణచంద : మండలంలోని తార్పెల్లిలో విద్యుత్తు కోతలను నిరసిస్తూ సోమవారం ఉదయం గ్రామస్థులు విద్యుత్‌ అధికారులను నిర్బందించారు. అధికారులు విద్యుత్తు బకాయిల వసూలు కోసం వెళ్లగానే గ్రామస్థుల కోతలపై ప్రశ్నించారు. గత కోంతకాలంగా విద్యుత్తు కోతలతో తల్లడిల్లుతున్న గ్రామస్థులు…

జిల్లా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

తూప్రాస్‌ :కళాశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో సోమావారం ఉదయం ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి చెందాడు లింగారెడ్డి వద్ద ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులతో వెళ్లున్న బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది తుప్రాస్‌కు చెందిన మన్నెం శ్రీకాంత్‌ అక్కడిక్కడే మృతి…

కరీంనగర్

సీబీఐకి చిక్కిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి

కరీంనగర్‌: భవిష్యనిధి కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికాడు. రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఆంజనేయులును సీబీఐ అధికారులు పట్టుకున్నారు. సీబీఐ అధికారులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.