Saturday, 7 November 2026

November 2012

ఆదిలాబాద్

బాసరలో పెరిగిన రద్దీ

బాసర : కార్తీకమాసం సందర్బంగా బాసరలో సరస్వతీ దేవిని దర్శించుకోనేందుకు వస్తున్న భక్తుల రద్దీ ఎక్కువైంది. భక్తులంతా కార్తీక స్నానాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఖమ్మం

చెత్తకుప్పలో దొరికిన నకిలీ అమెరికన్‌ డాలర్లు

ఖమ్మం: కొత్తగూడెం మండలం రామవరం మేషన్‌కాలనీలో రూ. 5 లక్షల విలువైన నకిలీ అమెరికన్‌ డాలర్లు లభించాయి. ఈ నకిలీ డాలర్లు చెత్తకుప్పలో పోలీసులకు దొరికాయి. ఇవి ఎవరికి సంబంధించినవనే విషయాన్ని పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

వార్తలు

ముద్దక్క కుటుంబంతో భేటీ అయిన సూకీ

అనంతపురం : మయన్మార్‌ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్‌సాన్‌ సూకీ పాపసానిపల్లెకు చేరుకున్నారు. అక్కడ డ్వాక్రా మహిళా సంఘం సభ్యురాలు ముద్దక్క కుటుంబసభ్యులతో భేటీ అయ్యారు. పొదుపు సంఘాల ద్వారా జీవితాన్ని చక్కదిద్దుకున్న ముద్దక్క ప్రగతి గురించి ఆడిగి…

వార్తలు

ఫోలోఆన్‌ దిశగా ఇంగ్లాండ్‌ -110-7

అహ్మదాబాద్‌: భారత్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఫోలోఆన్‌ దిశగా పయనిస్తోంది. మూడోరోజు లంచ్‌ సమయానికి 7 వికెట్లు నష్టపోయి 110 పరుగులు చేసింది.

వార్తలు

తెదేపా విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం

వీర్లపల్లి: తెదేపా విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బసచేసిన వీర్లపల్లి శిబిరంలో నేతలు సమావేశమయ్యారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎర్రన్నాయుడికి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు పార్టీలో భర్తీ…

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో విదేశీ నకిలీ కరెన్సీ పట్టివేత

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెం మండలం రామవరం మేషన్‌ కాలనీలో విదేశి నకలీ కరెన్సీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌ఖు తరలించినట్లు సమాచారం.

సీమాంధ్ర

అవిశ్వాసం ఓ డ్రామా: నారాయణ

రాజమండ్రి: ప్రభుత్వంపై నేతల అవిశ్వాస తీర్మాన ప్రకటనలన్నీ ఓ డ్రామా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై కాకుండా  ఎవరి నిజాయతీ నిరూపించుకోవాలని ఈ డ్రామా ఆడుతున్నారని ఆయన రాజమండ్రిలో ధ్వజమెత్తారు.

జిల్లా వార్తలు

ధ్రువ పత్రాల కుంభకోణం కేసులో ఏడుగురిపై కేసులు

వరంగల్‌ : కాకతీయ విశ్వవిద్యాలయంలో సంచలనం సృష్టంచిన ధ్రువపత్రాల కుంభకోణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సేకరించిన ప్రాథమిక ఆధారాల ప్రకారం కుంభకోణంతో ప్రమేయమున్న పరీక్షల నియంత్రణాధికారితో సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

వార్తలు

ఐదో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

అహ్మదాబాద్‌: భారత్‌తో జరగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.33వ ఓవర్లో ఓజా బౌలింగ్‌లో పీటర్స్‌స్‌ ఔట్‌ కాగా.. అదే ఓవర్లో సచిన్‌కు క్యాచ్‌ ఇచ్చి బెల్‌ వెనుదిరిగాడు, మూడు వికెట్ల నష్టానికి…

హైదరాబాద్

పాతబస్తీలో ప్రశాంతం.. రాకపోకలకు అనుమతి

హైదరాబాద్‌: అల్లర్లతో అట్టుడికిన పాతబస్తీ ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. పోలీసులు బారికేడ్లను ఎత్తివేసి రాకపోకలకు అనుతిస్తున్నారు. పరిస్థితిని బట్టి 144 సెక్షన్‌ కొనసాగిస్తామని పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ వెల్లడించారు.