Thursday, 5 November 2026

December 2012

సీమాంధ్ర

మట్టిమిద్దె కూలి ఇద్దరి మృతి

కర్నూలు : పాములపాడు మండలం బానుముక్కలలో మట్టిమిద్దె కూలి ఇద్దరు మృతి చెందారు. వర్షం నీటికి మిద్దె నాని కూలినట్లు స్థానికులు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక విచారణ చేపట్టారు.

సీమాంధ్ర

పసుపుమిల్లులో అగ్నిప్రమదం

గుంటూరు : దుగ్గిరాలలోని పసుపుమిల్లులో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగిభారీగా ఎగసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. నష్టం విలువ రూ. లక్షల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

వార్తలు

తమిళనాడుకు కావేరి జలాల విడుదల

బెంగుళూరు : సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నది జలాలలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయడం ప్రారంభించింది. గురువారం రాత్రి నుంచి కృష్ణ రాజసాగర్‌ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల…

సీమాంధ్ర

ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ

పెనుగొండ : అనంతపురం జిల్లా పెనుగొండ అల్విన్‌ కాలనీలోని ఉపాధ్యాయుని ఇంట్లోచోరీ జరిగింది. నిన్న రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ.3.50లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ. 50 వేల నగదును ఎత్తుకెళ్లారు బాధితుని ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు…

వార్తలు

ఫిలిఫ్పీన్స్‌లో పెను తుపాను : 475కు చేరిన మృతుల సంఖ్య

మనీలా: బోఫా పెను తుపాను ఫిలిఫ్పీన్స్‌ను అతలాకుతలం చేస్తోంది. తుపాను ధాటికి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 475కు చేరింది. వివిధ ప్రాంతాల్లో మూడు వందల మందికిపైగా గల్లంతయ్యారు. ఒక్క కంపోస్టెల కొండ ప్రాంతంలోనే 184…

జాతీయం

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 28 పాయింట్లకుపైగా లాభపడింది. నీఫ్టీ కూడా 3 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

జాతీయం

భారతీయ బాక్సింగ్‌ సమాఖ్య రద్దు

న్యూఢిల్లీ : ఒలింపిక్స్‌ సంఘం రద్దుతో కుంగిపోతున్న భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ బాక్సింగ్‌ సమాఖ్యను రద్దు చేస్తూ బాక్సింగ్‌ అంతర్జాతీయ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారతీయ బాక్సింగ్‌ సమాఖ్య ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే కారణంగా…

జాతీయం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌పవార్‌ ప్రమాణం

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ తిరిగి చేరారు. ఉపముఖ్యమంత్రిగా ఆయన ఈ ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణం చేశారు. మహారాష్ట్ర నీటి పారుదల శాఖలో చోటుచేసుకున్న అవినీతి కుంభకోణంలో ఆరోపణలు రావడంతో సెప్టెంబర్‌  25న అజిత్‌పవార్‌ ఉప…

హైదరాబాద్

ముఖ్యమంత్రితో బొత్స భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న కాంగ్రెస్‌ రాష్ట్ర సదస్సుపై సీఎంతో చర్చించారు.

సీమాంధ్ర

ఉన్మాది దాడిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

కాకినాడ: విద్యార్థులపై ఓ ఉన్మాది దాడి చేసిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానికులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఉన్మాదిని పోలీసులకు అప్పగించారు.