Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

జనవరి 2 నుంచి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో రోజువారీ విచారణ

ఢిల్లీ : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో హోంమంత్రి షిండే, సీఎం షీలాదీక్షిత్‌ భేటీ అయ్యారు. అత్యాచార ఘటనలపై విచారణకు 5 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు జనవరి 2 నుంచి ఇలాంటి ఘటనలపై ఫాస్ట్‌ ట్రాక్‌…

హైదరాబాద్

పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని శంకర్‌రావుకు హైకోర్టు సూచన

హైదరాబాద్‌ : ఎర్రచందనం రవాణాపై పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి శంకర్‌రావుకు హైకోర్టు సూచించింది. తీసుకోకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎర్రచందనం టెండర్లలో అవకతవకలపై దాఖలైన మరో పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.

హైదరాబాద్

సహకార ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తాం : బొత్స

హైదరాబాద్‌ : సహకార సంఘం ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్‌ నుంచి సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చిందని అర్థరాత్రి ఒంటరిగా తిరుగుతామా అని ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన…

హైదరాబాద్

సీఎంను కలిసిన తెదేపా ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : కోడెల అరెస్టు వివాదంపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమ నాయడు, రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ముఖ్యమంత్రిని కలిశారు. చిలుకలూరుపేట కోర్టులో కోడెల సహాయ 14 మంది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

హైదరాబాద్

రాష్ట్రాన్ని విభజించాల్సిందే

హైదరాబాద్‌ : రాష్ట్రాన్ని విభజించాల్సిందేనని ఆంధ్రా మేధావుల సంఘం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను విజ్ఞప్తి చేసింది. రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని అఖిలపక్షంలో చెప్పాలని సంఘ సభ్యులు బొత్సను కోరారు.

జాతీయం

జనవరి4న ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ సమావేశం

ఢిల్లీ : జనవరి4న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. మహిళలపై అత్యాచారాలు, దాడులు అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

సీమాంధ్ర

డీఈఓ కార్యాలయ ముట్టడి

నెల్లూరు : డీ.ఇ.ఒ అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు డి.ఇ.ఒ. కార్యాలయాన్ని ముట్టడించాయి. ఈ సందర్భంగా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

కరీంనగర్

ప్రైవేటు పాఠశాలలకు అండగా తెదేపా : బాబు

కరీంనగర్‌: ప్రైవేటు పాఠశాలల సమస్యలపై పోరాటానికి తెదేపా అండగా ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా మాకోసం పాదయాత్రలో భాగంగా ఆయన కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ మండలం నరసయ్యపల్లిలో ప్రైవేటు పాఠశాలల  యజమానులతో ముఖాముఖీ మాట్లాడారు. ఢిల్లీ…

హైదరాబాద్

ఈ నెల 27న తెదేపా పొలిట్‌ బ్యూరో సమావేశం : కడియం శ్రీహరి

హైదరాబాద్‌: కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌లో ఈ నెల 27న తెదేపా పొలిట్‌ బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెదేపా నేత కడియం శ్రీహరి తెలియజేశారు. పత్తి రైతుల సమస్యలపై జమ్మికుంటలో తలపెట్టిన ధర్నా వేదిక మారిందని ఆయన తెలిపారు. సమావేశంలో…