Saturday, 7 November 2026

December 2012

హైదరాబాద్

ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ

హైదరాబాద్‌: ఢిల్లీలో వైద్య విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్‌ చేసింది. ఈ రోజు ఏబీవీపీ కార్యకర్తలు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఆర్ట్స్‌కళాశాల నుంచి మొదలై తార్నాక వైజంక్షన్‌…

సీమాంధ్ర

రాబోయే బడ్జెట్‌లో కొత్త విధానం : మంత్రి ఆనం

నెల్లూరు: రాబోయే బడ్జెట్‌లో కొత్త విధానాన్ని అమలుపరచనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ్‌రెడ్డి తెలిపారు. కొత్తగా ఉపసంఘాలు వేసి వాటి సూచనలను బడ్జెట్‌లో పొందుపరుస్తామన్నారు. ధర్మాన వ్యవహారంలో మంత్రివర్గ నిర్ణయంపై  గవర్నర్‌ న్యాయసలహాలు కోరిన మాట వాస్తవమేనని, అడ్వకేట్‌ జనరల్‌,…

కరీంనగర్

చంద్రబాబుతో దేవేందర్‌గౌడ్‌ భేటీ

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో పాదయాత్రచేస్తున్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ఈ రోజు ఆ పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ కలిశారు. బాబుతో కొద్దిసేపు సమావేశమైన దేవేందర్‌గౌడ్‌ ఈ నెల 28న అఖిలపక్ష సమావేశంతో పాటు పాదయాత్ర గురించి…

వార్తలు

కఠిన శిక్ష పడేలా చట్టాలు చేయాలి :అన్నా హజారే

రాలెగావ్‌ సిద్ధి: అత్యాచార నేరం చేసినవారికి కఠిన శిక్ష విధించేలా చట్టం రూపొందించాలని, ఈ నేరాలను త్వరితంగా విచారించేందుకు న్యాయవ్యవస్థను సిద్దంచేయాలని సామాజిక వేత్త అన్నాహజారే డిమాండ్‌ చేశారు. అత్యాచారాలపట్ల నిరసన తెలుపుతూ న్యాయం కావాలని దేశవ్యాప్తంగా నినదిస్తున్న…

సీమాంధ్ర

తెదేపా నేత కోడెల శివప్రసాద్‌రావుపై చేయి చేసుకున్న పోలీసులు

గుంటూరు: సహకార సంఘాల ఎన్నికల్లో అక్రమాలను నిరసిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆందోళనకు దిగిన తెదేపా నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావుపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనకు సపర్యలు…

వార్తలు

ప్రజాభిప్రాయ సేకరణలో మోర్సీ వైపే మొగ్గు

కైరో: ఈజిప్టులో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అధ్యక్షుడు మోర్సీకి అనుకూలంగా ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అధ్యక్షుడికి విశేష అధికారాలు వెల్లడించారు. అధ్యక్షుడికి విశేష అధికారాలు కల్పించే రాజ్యాంగ సవరణపై రెండు దఫాలుగా…

జాతీయం

పాక్‌తో జరిగే మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపిక

ముంబయి: పాక్‌తో జరిగే టీ 20, వన్డే మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌  కమిటీ ఎంపిక చేసింది. టీ 20 జట్టులో అభిమన్యు మిథున్‌ స్థానంలో ఫాస్ట్‌-మీడియమ్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మకు చోటు కల్పించారు. వన్డే టీంలో…

హైదరాబాద్

భాష,సంస్కృతి కాపాడుకోవడంలో ముందుండాలి

శాసన సభాపతి నాదెండ్ల హైదరాబాద్‌: భాష, సంస్కృతిని కాపడుకోవడంలో అందరూ ముందుండాలని శాసన సభాపతి నాదెండ్ల మనోహర్‌ అభిప్రాయపడ్డారు. శాసన సభలో తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. దివంగతులైన గౌరవ సభ్యులకు తన హయాంలో…

సీమాంధ్ర

స్వర్ణరథంపై వూరేగిన మలయప్పస్వామి

తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో మలయప్పస్వామి స్వర్ణరథంపై వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆ దేవదేవుని వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. స్వర్ణరథం లాగేందుకు భక్తులు పోటీపడ్డారు.

హైదరాబాద్

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

హైదరాబాద్‌ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. అర్థరాత్రి నుంచే వివిధ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కర్నూలు శ్రీశైలం మహాక్షత్రానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర…