Friday, 6 November 2026

2013లో అంగారకునిపై అడుగు పెడతాం: ప్రధాని

న్యూఢిల్లీ: 2013 నవంబర్‌ కల్లా అంగారక గ్రహంపై మనం అడుగు పెడతామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఈరోజు ఆయన ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేసిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. మన దేశంలో అరుణ గ్రహమైన అంగారకునిపైకి వెళ్లడానికి రూ. 450 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టును చేపట్టిందని ఆయన వెల్లడించారు. ఇస్రోరూపొందించే ఒక ఉప గ్రహం అంగారకునిపై అడుగు పెట్టి, నాపా వారు పంపించిన క్యూరీయాసిటీని పలకరించ గలదని ఆయన ప్రకటించారు. ఈ ఉపగ్రహం శ్రీహరి కోట నుంచి ప్రయోగించే పీఎస్‌ఎల్‌ రాకెట్‌ ద్వారా అంగారకునిపైకి చేరుకుంటుందని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *