Wednesday, 4 November 2026

January 2013

వార్తలు

ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి భారత్‌ ఔట్‌

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా ఓపెన నుంచి భారత్‌ నిష్క్రమించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌ వరకూ వచ్చిన సానియా, మహేశ్‌భూపతి ఈరోజు తమ తమ మ్యాచ్‌లలో పరాజయం ఎదుర్కోన్నారు. సానియా తన అమెరికన్‌ భాగస్వామి బాబ్‌బ్రయాన్‌తో కలిసి  జెక్‌…

జిల్లా వార్తలు

అక్బరుద్దీన్‌ బెయిల్‌ పిటిషన్‌

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా సంగారెడ్డి కోర్టులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తరపున ఆయన న్యాయవాది రఘునందన్‌రావు బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. అక్బరుద్దీన్‌ ఆదిలాబాద్‌ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌ కార్యాలయం ముట్టడించిన విద్యార్ధి సంఘాలు

వరంగల్‌ : తెలంగాణపై ఆజాద్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ వరంగల్‌లో విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగారు. హన్మకొండలోని కాంగ్రెస్‌ భవన్‌ ముట్టడికి యత్నించిన విద్యార్థులకు పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థులను…

జాతీయం

జంతర్‌మంతర్‌ వద్ద భాజపా ఆందోళన

ఢిల్లీ : భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి షిండే తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని భాజపా నేత సుష్మా స్వరాజ్‌ డిమాండ్‌ చేశారు. షిండే వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు జంతర్‌మంతర్‌ వద్ద భాజపా ఆందోళనలో…

హైదరాబాద్

27న సమరదీక్ష : తెలంగాణ ఉద్యోగ ఐకాస

హైదరాబాద్‌: ఈ నెల 27న ఇందిరాపార్కు వద్ద సమరదీక్ష చేపట్టాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించింది. తెలంగాణ అంశంపై చర్చించేందుకు పాత ఎమ్మెల్యే నివాస ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ సంఘాల ఐకాస సమావేశంలో ఈ మేరకు…

వార్తలు

చంచల్‌గూడ జైలుల్లో జగన్‌ను కలిసిన పేర్ని నాని

చంచల్‌గూడ : ప్రభుత్వవిప కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్ని వెంకటేశ్వరరావు (నాని) జైల్లో ఉన్న జగన్‌ను గురువారం కలిసి పరామర్శించారు. గురువారం జగన్‌ను కలిసిన వారిలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, జగన్‌ సతీమణి భారతిరెడ్డి ఉన్నారు.

హైదరాబాద్

27న తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: ఈ నెల 27న తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం కానుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 31,200, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.30,000 వెండి కిలో ధర రూ. 59,690గా పలుకుతోంది.

హైదరాబాద్

ఇందిరాపార్కు వద్ద భాజపా సత్యాగ్రహం

హైదరాబాద్‌: భాజపా, ఆర్‌ఎన్‌ఎన్‌లపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భాజపా ఇందిరాపార్కు వద్ద ఈరోజు సత్యాగ్రహం చేపట్టింది. ఈ సత్యాగ్రహంలో పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, బంగారు లక్ష్మణ్‌ తదితరులు పాల్గోన్నారు.

వార్తలు

ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్లో అజెరెంకా

మెల్న్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా ఓపెన్‌లో బెలారన్‌కు చెందిన విక్టోరియా అజెరెంకా ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీన్‌లో అమెరికాకు చెందిన స్టీఫెన్‌పై 6-1, 6-4 తేగాతో అజెరెంకా విజయం సాధించింది. ఫైనల్లో చైన్నా క్రీడాకారిణి లీనాతో ఆమె తలపడనుంది.