Thursday, 5 November 2026

January 2013

సీమాంధ్ర

అనుమంచిపల్లిలో లగడపాటి అరెస్టు

కృష్ణా : సమైక్యవాదానికి చంద్రబాబు మద్దతు తెలపాలని కనువిప్పు యాత్రకు సిద్దమైన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం అనుమంచిపల్లిలో లగడపాటి బస చేసిన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.…

జాతీయం

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరాం : గాదె

న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్‌ పెద్దలను కోరినట్లు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తెలిపారు. ఈ ఉదయం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌తో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. అనంతరం గాదె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని…

వార్తలు

క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరిక అజరెంక

మెల్‌బోర్న్‌: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ విక్టోరియా అజరెంక ఆస్ట్రేలియా ఓపెన్‌ ఛాంపియన్‌షివ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కి దూసుకుపోయారు. ఎలీనా వెస్నినాపై 6-1, 6-1 తేడాతో విజయం సాధించారు. బుధవారం మెల్‌బోర్న్‌లో జరగనున్న క్వార్టర్‌ ఫైనల్స్‌లో స్వెట్‌లేనాతో అజరెంకా తలపడనున్నారు.

జాతీయం

తెలంగాణపై ప్రకటన షిండేనే చేస్తారు : దిగ్విజయ్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై  నెలరోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్‌ గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే తెలంగాణపై ప్రకటన కూడా షిండేనే చేస్తారని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ…

జిల్లా వార్తలు

సంగారెడ్డి కోర్టులో లొంగిపోయిన ఎంపీ అసదుద్దీన్‌

మెదక్‌ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఇవాళ సంగారెడ్డి కోర్టులో లొంగిపోయారు. 2005లో అప్పటి కలెక్టర్‌ అనీల్‌కుమార్‌ను దూషించిన కేసులో ఆయన విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. అసదుద్దీన్‌ తరపు న్యాయవాదులు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

హైదరాబాద్

రాహుల్‌తో ఒరిగేదేమి లేదు : రాఘవులు

హైదరాబాద్‌  : చింతన్‌ శిబిర్‌ కాంగ్రెస్‌ చింతను తీర్చే విధంగా లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు. రాహుల్‌ను పార్టీలో మొదటి స్థానంలో కూర్చోపెట్టినా ప్రజలకు ఒరిగేదేమి లేదని మండిపడ్డారు. రాహుల్‌ ఆవేశం కుటుంబం గురించే తప్పా,…

హైదరాబాద్

సీఎల్పీలో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు భేటీ

హైదరాబాద్‌: అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. భేటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి లకాష్మరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్‌, బాలానాయక్‌, ఆమోస్‌, మోహన్‌, అనీల్‌లు హాజరయ్యారు.

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.30,870లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29, 800లుగా ఉంది. కిలో…

హైదరాబాద్

సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ నిలుపుదల

హైదరాబాద్‌: సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రభుత్వం నిలుపుదల చేసింది. మంత్రి కాసుకృష్ణారెడ్డి ఆదేశాలతో ఆ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లను నోటిఫికేషన్‌ నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్

న్యూడెమోక్రసీ ఆఫీస్‌లో టీజేఏసీ భేటీ

హైదరాబాద్‌: న్యూడెమోక్రసీ ఆఫీసులో తెలంగాణ రాజకీయ జేఏసీ రౌండ్‌టేబుల్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు, టీఆర్‌ఎస్‌, బీజేపీ, నాగం జనార్థన్‌రెడ్డి తదితర నేతలు హాజరై ప్రసంగిస్తున్నారు.