Thursday, 5 November 2026

May 2013

సీమాంధ్ర

శ్రీవారిని దర్శించుకున్న రాజశేఖర్‌, జీవిత

తిరుమల: సినీ నటులు రాజశేఖర్‌, జీవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం జీవిత మీడియాతో మాట్లాడుతూ తాము మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నామని చెప్పారు.

తెలంగాణ

సీబీఐ డైరెక్టర్‌ క్షమాపణలు చెప్పాలి: సురవరం

హైదరాబాద్‌: రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బన్సల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సీబీఐ డైరెక్టర్‌ మాట్లాడడాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తప్పుబట్టారు. కేసు ప్రాథమిక దశలోనే రంజిత్‌ సిన్హా చేసిన…

జాతీయం

సోనియాతో భేటీకానున్న సీఎం కిరణ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శక్రవారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఆరోపణలున్న మంత్రుల తొలగింపు వ్యవహారం, మంత్రికవర్గ పునర్‌వ్యవస్తీకరణ, కార్పోరేషన్‌ ఛైర్మన్ల నియామకంపై ఈ భేటీలో సీఎం చర్చించనున్నట్లు…

తెలంగాణ

వైకాపా విస్తృతస్థాయి భేటీకి హాజరుకాని కొణతాల

హైదరాబాద్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నివాసంలో పార్టీ విస్తృతసాయి సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ భేటీకి పార్టీ సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణా హాజరుకాలేదు.

జాతీయం

సోనియాతో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై సోనియాతో సీఎం చర్చిస్తున్నారు.

జాతీయం

నేలచూపులు చూస్తున్న పసిడి

ముంబయి, జనంసాక్షి: బంగారం ధరలు వరుసగా నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌ బలపడటం వల్ల ఔన్స్‌ గొల్డ్‌ ధర 3 డాలర్లు నష్టపోతూ 1382 డాలర్లకు సమీపంలో ట్రేడవుతుంది. గత 10 రోజుల్లో ఔన్స్‌ ధర దాదాపు 100 డాలర్లు…

తెలంగాణ

దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌ వద్ద మహిళ హల్‌చల్‌

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌ వద్ద మతిస్థిమితం లేని ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. చెట్టు ఎక్కి దూకుతానని బెదిరించింది. దీంతో స్థానికులు ఆమెను కిందికి దించేందుకు యత్నిస్తున్నారు.

జాతీయం

ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. చెన్నైలో 8 చోట్ట సోదాలు

చెన్నై: ఐపీఎల్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో చెన్నైలో పోలీసులు 8 చోట్ల సోదాలు చేపట్టారు. ఐదుగురు బుకీలను అరెస్టు చేశారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

సీమాంధ్ర

దెందులూరు రోడ్డు ప్రమాదంలో 6కి చేరిన మృతుల సంఖ్య

దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరెపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు మృతుల సంఖ్య ఆరుకి చేరింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. ఘటనాస్థలిలో ఐదుగురు ప్రాణాలు…

తెలంగాణ

గురుకుల పాఠశాలల్లో 94.99 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల పాఠశాలల్లో 94.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 45.50గా ఉంది.