హైదరాబాద్: ఐసెట్ – 2014 విద్యాసంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఎంసీఏ, ఎంబీఏ కోర్సులకు ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పొందవ్చని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కే ఓంప్రకాశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి దరఖస్తుల స్వీకరణ ప్రారంభమైందని. ఎలాంటి ఆపరాద రుసుపు లేకుండా చివరి తేది ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250 చెల్లించి దరఖాస్తు ఫారం పొందవచ్చని తెలిపారు. రూ.500 అపరాద రుసుముతో ఏప్రిల్ 15 వరకు రూ.2 వేలతో ఏప్రిల్ 25 వరకు, రూ. వేలతో మే 6 వరకు, రూ.1000 అపరాధ రుసుముతో మే 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 23న అర్హత పరీక్ష జరుగుతుందన్నారు.




