Tuesday, 3 November 2026

రేపు న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో టీ విజయోత్సవసభ

హైదరాబాద్‌: ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా ఎరుపెక్కింది. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించనున్న తెలంగాణ విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. సభకు కార్యకర్తలను పెద్ద ఎత్తున కదిలించేందుకు పార్టీ నాయకత్వం అన్ని చర్యలు తీసుకుంది. పార్టీకి బలం ఉన్న ప్రతి గ్రామం నుంచి వందల సంభ్యలో ప్రజలను తరలించేందుకు విస్తృత ప్రచారం చేపట్టింది. పార్టీ అనుబంధ సంఘాలైన పీడీఎస్‌యూ, పీవైఎల్‌, పీడబ్ల్యూ , అరుణోదయ తదితర సంఘాలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. టీజేఏసీ చైర్మెన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఉద్యోగనేతలు కూడా సభకుహాజరుకానున్నారు. సభకు పోరుబిడ్డలు, తెలంగాణవాదులు తరలిరావాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *