Wednesday, 4 November 2026

May 2015

జిల్లా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం..

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 583 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. మస్కట్ నుంచి నగరానికి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద తనిఖీలు నిర్వహించి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆదిలాబాద్

మందమర్రిలో ఐదేళ్ల బాలుడు హత్య..

ఆదిలాబాద్ : జిల్లాలోని మందమర్రిలో యూకేజీ చదువుతున్న ఐదేళ్ల బాలుడు వినయ్ ను దుండగులు దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి పడేశారు.

హైదరాబాద్

డ్రంక్ అండ్ డ్రైవ్..11 మందిపై కేసులు..

హైదరాబాద్ : నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అతిగా మద్యం సేవించిన వారిపై కేసులు నమోదు చేశారు. 11మందిపై కేసులు నమోదు చేశారు.

సీమాంధ్ర

భార్యపై అత్యాచారయత్నం భర్తపై దాడి..

అనంతపురం : చిలమత్తూరు (మం) యగ్నిశెట్టిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడిన దుండగులు దంపతులపై దాడి చేశారు. భార్యపై అత్యాచారం చేయబోతున్న భర్త అడ్డుకున్నాడు. దీనితో దుండగులు జరిపిన దాడిలో భర్తకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని…

సీమాంధ్ర

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 18 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి పది గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు ఆరు గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూఉ గంటల సమయం పడుతోంది.

జాతీయం

నేటి ఐపీఎల్ మ్యాచ్ లు..

ఢిల్లీ : మోహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు కింగ్స్ ఎలవన్ పంజాబ్‌ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలడపనున్నాయి. ముంబై లో రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్…

Main

శంషాబాద్ వద్ద నిలిచిపోయిన నందన ట్రావెల్స్ బస్సు.

రంగారెడ్డి : హైదరాబాద్ నుండి తిరుపతికి వెళుతున్న నందనట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో రాత్రి పది గంటల సమయంలో శంషాబాద్ వద్ద నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రాత్రి నుండి ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.