అనంతపురం : చిలమత్తూరు (మం) యగ్నిశెట్టిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడిన దుండగులు దంపతులపై దాడి చేశారు. భార్యపై అత్యాచారం చేయబోతున్న భర్త అడ్డుకున్నాడు. దీనితో దుండగులు జరిపిన దాడిలో భర్తకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితులు పరారీలో ఉన్నారు.




