Thursday, 5 November 2026

CITU కరీంనగర్ జిల్లా 10వ మహాసభలు బ్రోచర్స్ విడుదల…
కరీంనగర్ టౌన్ నవంబర్ 14(జనం సాక్షి)

డిసెంబర్ 3,4 తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే CITU కరీంనగర్ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని ఆహ్వాన సంఘం అద్యక్షుడు, మేయర్ Y. సునీల్ రావు మహాసభల బ్రొచర్స్,కరపత్రాలు సోమ వారం విడుదల చేశారు. ఈ సందర్బంగా

మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సీఐటీయూ జిల్లా మహాసభలు విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు LIC, బ్యాంక్ బిఎస్ఎన్ఎల్, రైల్వే,విమాన, రోడ్ మార్గం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలుకు అప్పగిస్తున్నారు. కేంద్ర విద్యుత్ సవరణ చట్టం 2022 ద్వారా కరెంట్ భారాలు,పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ప్రజల మీద భారాలు పడుతున్నాయి.కార్మికులకు కనీస వేతనం,PF,ESI, ఉద్యోగ భద్రత కోసం మా ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కార్మిక సంఘాలు ,అసోసియేషన్స్ కలుపుకొని ఐక్య కార్యాచరణ రూపొందించాలని సీఐటీయూ నాయకులను కోరారు.కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల కలిగే కార్మిక వర్గం యొక్క ఐక్యతను సీఐటీయూ ముందు ఉంది.జిల్లా మహాసభలో తీర్మానాలు ఇలాంటి అంశాలపై చెయ్యాలని కోరారు.సీఐటీయూ పోరాటాల ముందు ఉన్న ఆర్థికం గా వెనకబడి ఉంది.వీటి జయప్రదం కోసం ఉద్యోగ, కార్మిక వర్గాలతో పాటు శ్రేయోభిలాషిలు,ప్రజానీకం హార్దిక, ఆర్ధిక సహాయం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు.శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు గిట్ల ముకుంద రెడ్డి,కోశాధికారి G. రాజేశం,జిల్లా సహాయ కార్యదర్శి పున్నo రవి పాల్గొన్నారు.