Thursday, 5 November 2026

వందల ఏళు గడిచిన రచనలు చేక్కు చెదారకుండా కాపాడే తాళ పత్ర చెట్టు దృశ్యం

వందల ఏళు గడిచిన రచనలు చేక్కు చెదారకుండా కాపాడే తాళ పత్ర చెట్టు దృశ్యం

-వెలుగులోకి వచ్చిన శ్రీ తాళం చెట్టు

-గుర్తించిన గౌడ కార్మికులు

-రచనలకు కేరఫ్ శ్రీ తాళ పత్రాలు

-హన్మకొండ జిల్లా దండేపల్లి
గ్రామంలో దృశ్యం

హన్మకొండ బ్యూరో చీఫ్14 నవంబర్ జనంసాక్షి

 

బ్రాహ్మమ్ గారి సహా తాళ పత్ర గ్రంధాలు గురించి విన్న ప్రతి సారి.. వందల సంవత్సరాలు గడిచిన చెక్కు చెదారకుండా ఉండే పత్రాలను ఏ చెట్ల నుండి సేకరించరో అనె సందేహం కలుగుతుంది దానికి సమాధానము హన్మకొండ జిల్లా లో దొరికింది,కొన్ని వందల సంత్సరాల క్రితం మన పూర్వికులు తమ రచనలు తల పత్ర గ్రంధాలలో నిక్షిప్తాము చేసేవారు, ఐతే వాటి కోసం కొన్ని ప్రత్యేక చెట్ల నుంచి ఆకులు సేకరించేవారు, వాటిని ఎండబెట్టి క్రమం పద్దతిలో అమర్చి తాళ పత్రాలు సిద్ధం చేసేవారు వాటి పైన ఘటం తో రాసేవారు, అయితే ఈ చెట్ల చరిత్ర చూసినట్లు అయితే వందల సంవత్సరాల క్రితం శ్రీలంక, భారతదేశం, కేరళ, తమిళనాడు, కర్ణాటక, లలో విరివిరిగా కనిపించే చెట్లు, ఇటీవలే కాలంలో అంతరించి పోయాయి, కానీ హన్మకొండ జిల్లలో ఎల్కతుర్తి మండలంలో దండేపల్లి గ్రామంలో తాళ పత్రాల చెట్టు దర్శనం ఇచ్చింది, మొదట్లో గౌడ కార్మికులు ఈ చెట్టు తాటి చెట్టు గా పరిగణించారు, కానీ చెట్టు శిఖర భాగంలో పూల గుత్తులు రావటం, పొడువు గా పెరగటం, చుడానికి అందంగా కనిపించడం తో, అంతేకాకుండ ఆకులు ఎండిపోయి పూల గుత్తలు మాత్రం లేత పసుపు వర్ణంలో ఉండటం గమనించారుశిఖం పై భాగంలో పూల గుత్తులు రావటం తో శ్రీ తాళ చెట్టు గా చేప్పవచ్చు అని గౌడ కార్మికులు అన్నారు, దీనిని పూర్వికులు ఆయుర్వేదం మందుల లో కూడ వాడేవారు అన్నారు.