హైదరాబాద్ సిటీ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మిగిలిపోయిన ఆటో రిక్షా పర్మిట్‌లను ఈనెల 21 నుంచి జారీ చేస్తామని హైదరాబాద్ జిల్లా సంయుక్త రవాణా శాఖ కమిషనర్ టి.రఘునాథ్ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 14 ప్రకారం నగరంలో ఇంకా 1,788 ఆటోరిక్షాలకు పర్మిట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఈ పర్మిట్లను ఆటోడ్రైవర్లకు ఇవ్వనున్నామని తెలిపారు. ఇప్పటికే రవాణా శాఖలో ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి పర్మిట్లు ఇస్తామన్నారు. ఆటోడ్రైవర్లు తమ కుల, నివాస, డ్రైవింగ్ లైసెన్సు వంటి ధ్రువపత్రాలతో ఆర్టీఏ కార్యాలయానికి రావాలని సూచించారు. ఇందులో ఓసీలకు 694, బీసీలకు, 965, ఎస్సీ, ఎస్టీలకు 129 ఆటోలు జారీ చేయనున్నామని తెలిపారు.




