Wednesday, 4 November 2026

ఈనెల 21నుంచి 27 వరకు కాంగ్రెస్‌ బుస్సుయాత్ర: రఘువీరా

ఈనెల 21నుంచి 27 వరకు
కాంగ్రెస్‌ బుస్సుయాత్ర: రఘువీరా
హైదరాబాద్‌: ఈ నెల 21నుంచి 27 తేది వరకు బస్సుయాత్ర చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ నెల 21న ఉదయం నుంచి శ్రీకాకుళం, మధ్యాహ్నాం విజయనగరంలో కార్యకర్తల విస్తృతస్ధాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో అభిమానులకు, జెండా మోసే కార్యకర్తలకు లోటు లేదన్నారు.బయటికి వెళ్లినవాళ్లు. వెళ్లబోతున్నవాళ్లు పార్టీలోకి రావాలని రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. బస్సుయాత్రలో ఆసక్తిగల కార్యకర్తల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపారు. నేతలు లేని చోట కొత్త నాయకత్వానికి జవసత్వాలు కల్పిస్తామని వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు చిరంజీవి, ఆనం రాంనారాయణరెడ్డి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *