బ్యాంకు ఉద్యోగి భార్య హత్యపై
బలపడుతున్న అనుమానాలు
హైదరాబాద్: విజయవాడలో అదృశ్యమైన… కంకిపాడు కాల్వలో శవమై దొరికిన సప్తగిరి బ్యాంకు ఉద్యొగి భార్యను వారు నివసించే అపార్ట్‌మెంట్‌లో ఉండే కొంతమంది హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 15 నుంచి సాయిరాం భార్య హిమబిందు అదృశ్యమైంది. ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు కనిపించకపోవడంతో పటమట పోలీసులు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి కంకిపాడు సమీపంలోని బందరు కాల్వలో లభించిన హిమబిందు మృతదేహం గుర్తుపట్టని విధంగా కుళ్లిపోయింది. అయితే…. ఆమెను ఎవరో చంపేశారని అనుమానంగా ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని బంధవులు చెబుతున్నారు. హిమబిందు వస్త్రాలు అపార్ట్‌మెంట్ మెట్ల కింద ఉన్న ఖాళీ ప్రదేశంలో లభించడంతో వీరి అనుమానం మరింత బలపడింది. వీరు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని పక్కగదిలో ఉంటున్న డ్రైవర్ సుఖానితో పాటు వాచ్‌మెన్, ఓ ప్లంబర్ కలిసి డబ్బు, నగల కోసమే ఈ హత్యచేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నా…. పోలీసులు ధ్రువీకరించడం లేదు.




