:వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
హైదరాబాద్: రైతు చైతన్య యాత్రలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి లక్ష్మీనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2 వరకు ఈ యాత్రలు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. సెలవు దినాలను కలుపుకుని పది రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతామన్నారు.




