Monday, 2 November 2026

దేవస్థానంకు ఇల్లు దానంచేసిన అర్చకుడు విఎన్ చార్యులు … రామచంద్రస్వామి దేవస్థానం పూజారిగా వరుణ్

స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 27, ( జనం సాక్షి ) : మండలంలోని తాటికొండ గ్రామంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పక్కన గల తాటికొండ గ్రా మానికిచెందిన అర్చకుడు సౌమిత్రి వెంకట నరసిం హ చార్యులు తన ఇంటిని( 9- 53 ) దేవస్థానం కు అప్పగిస్తున్నట్లు అగ్రిమెంట్ పత్రాన్ని సర్పంచ్ చల్ల ఉమా సుధీర్ రెడ్డికి, వైస్ ఎంపీపీ చల్లా సుధీ ర్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా విఎన్ చా ర్యులు మాట్లాడుతూ తనఇంటిని దాన పూర్వకం గా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అవసరం నిమిత్తం ఇవ్వడం జరిగిందని,ఇక నుండి నాకు గా ని,నావారసులకుగాని ఇంటిపై ఎలాంటి హక్కులు ఉండవని కుటుంబ సమ్మతితోనే ఇవ్వడం జరిగిం దన్నారు. ఇంటి స్థలంలో చిన్న వేదిక మండపము కట్టి సభలునిర్వహించుకోవడానికి,భజనలు నిర్వ హించుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ నిర్మాణానికి తన వంతు సహాయంగా 50 వేల రూపాయలు చందాగా ఇస్తాననిఅన్నారు.ఇల్లును దానం చేసిన సౌమిత్రి వెంకట నరసింహచార్యుల ను గ్రామ సర్పంచ్ చల్ల ఉమా సుమా సుధీర్ రెడ్డి, వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డితోపాటు గ్రామస్తులు శాలువాతో సన్మానించారు.అదే విధంగా గ్రామస్తు ల కోరికమేరకు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థా న పూజారిగా అర్చకుడు వరుణ్ కొనసాగుతాడని సర్పంచ్ తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, అర్చకు లు, ప్రజలు పాల్గొన్నారు.