హుజూర్ నగర్ మార్చి 3 (జనం సాక్షి): గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వేపలసింగారంలో ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కంటి సమస్యలు ఉన్నవారికి అద్దాలు పంపిణీ చేసి ఆపరేషన్ అవసరమైన వారిని రెఫర్ చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాముల హరి లీల, అన్నెం కొండారెడ్డి, వరలక్ష్మి రామ్మోహన్ వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం




