కంటి పరీక్షలకే పరిమితమైన కంటి వెలుగు
అద్దాలు పంపిణీలో జాప్యం
కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్
భువనగిరి టౌన్ (జనం సాక్షి):—
భువనగిరి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు 23వ వార్డులో బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ప్రారంభించి ప్రజలకు కంటి వైద్య పరీక్షలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని కొండంత ఆశలు పెట్టుకున్న వారి ఆశలు నిరాశ అవుతున్నాయి కంటి వెలుగు కార్యక్రమం కేవలం కంటి పరీక్షలకే పరిమితమైనవి తప్ప కంటి పరీక్షలు చేయించుకున్న ప్రజలకు వాళ్లకు కావాల్సిన అద్దాలు ఇవ్వడంలో పూర్తిగా జాప్యం జరుగుతుందని 20 రోజులు గడిచిన కూడా అద్దాలు పంపిణీ కావడంలేదని కంటి పరీక్షలు చేసుకున్న ప్రజలు అద్దాలు రాకపోవడం వల్ల తీవ్ర నిరాశకు గురై ఆందోళన చెందుతున్నారు అలాగే కంటి పరీక్షలు చేయించుకున్న ప్రజలకు డాక్టర్లు కంపల్సరిగా కంటి శస్త్ర చికిత్స చేసుకోవాలని నిర్ధారిస్తే కంటి శస్త్ర చికిత్య ఆపరేషన్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేదని వాళ్లను హైదరాబాద్ మౌలాలి లయన్స్ క్లబ్ కు పంపేయడం వల్ల పేద ప్రజల ఆర్థిక స్తోమత సరిగ్గా లేక చాలామంది కంటి ఆపరేషన్లు చేసుకోవడానికి హైదరాబాద్ కు వెళ్లడం లేదని అలాంటి పేద ప్రజలకు ప్రభుత్వం తరఫున హైదరాబాదుకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయించి ప్రభుత్వపరంగా వాళ్లకు దగ్గరుండి కంటి శస్త్ర చికిత్స చేయించి మరలా తిరిగి వాళ్ల గ్రామాల వద్ద వదిలేయాలని అన్నారు ఈకార్యక్రమంలో వార్డు ప్రజలు యాదగిరి పోచయ్య పెంటమ్మ ఎల్లమ్మ రమణ సుధా రేణుక లావణ్య రాధిక మహేందర్ దేవేందర్ నర్సింగరావు ప్రభాకర్ డాక్టర్ల బృందం మరియు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.




