Thursday, 5 November 2026

-ఆల్ సెయింట్స్ హై స్కూల్ లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం.

-బహుమతులు అందజేసిన చేసిన ప్రధానోపాధ్యాయులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి 14 (జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ని ఆల్ సెయింట్స్ హై స్కూల్ లో మంగళవారం విద్యార్థిని విద్యార్థు లు స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వ హించుకున్నారు.ప్రధానోపాధ్యాయు లు గా విశ్వబిందు,మండల విద్యాధికారి గా కార్తిక్ యాదవ్ లతో పాటు మొత్తం 47 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.చిన్న పిల్లలు చీరకట్టులో పాఠాలు బోధిస్తూ చూపరులను ఆకట్టుకు న్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయ విద్యార్థినీ విద్యార్థులను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయు లు సుజ్జి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుండే క్రమశిక్షణ ను అలవరుచుకోవాలని, ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఎంచు కొని ఆ లక్ష్యాన్ని చేరేవరకు పట్టుదలతో చదివి సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సులోచన, మంజుల,మిన్ని, జ్యోతి, మాధవి,రమ, మిన్ని,పల్లవి, సౌదామణి, శ్రీవాణి, కరిష్మ, అనిత, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.