Friday, 6 November 2026

23 ఏళ్ల ఆస్ట్రేలియన్ బాక్సర్ స్మిత్ మృతి

Latest News

బ్రిస్బేన్: రెండు రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆస్ట్రేలియన్ బాక్సర్ బ్రేడన్ స్మిత్ 23 ఇవాళ మృతి చెందాడు. డబ్ల్యూబీసీ ఏషియన్‌బాక్సింగ్ టైటిల్ కోసం పిలిప్పీన్స్ ఆటగాడు జాన్‌మోరాల్డే తో బాక్సింగ్ పోరులో తలపడుతున్న సమయంలో స్మిత్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని అధికారులు హుటాహుటిన బ్రిస్బేన్ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన స్మిత్ కోమాలోకి వెళ్లడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారని స్మిత్ కుటుంబసభ్యుడు జేమ్స్ వెల్లడించారు. స్మిత్ కుప్పకూలిపోవడానికంటే ముందు ఎంతో చురుకుగా ఉన్నాడని..తన ప్రత్యర్థి జాన్‌కు విజయం సాధించాలని శుభాకాంక్షలు కూడా తెలిపారని పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *